ETV Bharat / sports

బంగ్లా కెప్టెన్​ యూటర్న్​.. రిటైర్మెంట్​ నిర్ణయం వెనక్కి.. ప్రధాని జోక్యంతో..​

బంగ్లాదేశ్​ క్రికెట్​ టీమ్​ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్​ యూటర్న్​ తీసుకున్నాడు. గురువారం అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించి.. శుక్రవారం ఉపసంహరించుకున్నాడు. అయితే, బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా జోక్యం వల్లే మనసు మార్చుకున్నానని తెలిపాడు.

Tamim Iqbal Retirement
Tamim Iqbal Retirement
author img

By

Published : Jul 7, 2023, 10:51 PM IST

Tamim Iqbal Retirement : బంగ్లాదేశ్​ క్రికెట్​ టీమ్​ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్​ మనసు మార్చుకున్నాడు. గురువారం అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్​.. శుక్రవారం ఉపసంహరించుకున్నాడు. రిటైర్మెంట్ విషయమై తమీమ్ ఇక్బాల్ శుక్రవారం బంగ్లాదేశ్ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని కోరినట్లు తమీమ్ ఇక్బాల్ మీడియాకు తెలిపాడు. ఈ మేరకు తమీమ్​ మీడియాతో మాట్లాడాడు.

రిటైర్మెంట్ గురించి ఎవరు చెప్పినా వినబోనని.. కానీ ప్రధాని షేక్ హసీనా మాటలకు అభ్యంతరం చెప్పలేనని.. అందుకే రిటైర్మెంట్ ఉపసంహరించుకుంటున్నానని తమీమ్​ అన్నాడు. నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలని బంగ్లాదేశ్ ప్రధాని తనను స్వయంగా కోరారని చెప్పాడు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నానని.. మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా అని వివరించాడు.

తమీమ్​ భావోద్వేగం..
గురువారం అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన తమీమ్ భావోద్వేగానికి గురయ్యాడు. 16 ఏళ్ల తన క్రికెట్​ కెరీర్​లో తనక సపోర్ట్​ చేసిన అభిమానులతో పాటు బంగ్లా క్రికెట్​ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కంటతడి పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన తరుణం వచ్చిందని వ్యాఖ్యానించాడు. తమీమ్ ఇక్బాల్‌ స్థానంలో కొత్త కెప్టెన్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. అయితే మళ్లీ షకిబ్ అల్ హసన్‌కు గానీ లిటన్ దాస్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. బంగ్లా-అఫ్గానిస్థాన్‌ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే జులై 8న, మూడో వన్డే జులై 11న జరగనుంది.

Bangladesh vs Afghanistan ODI : తన సుదీర్ఘ క్రికెట్​ కెరీర్​లో అన్ని ఫార్మాటల్లో కలిపి మొత్తం 389 మ్యాచ్​లాడిన ఈ స్టార్​ ఆటగాడు.. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాటుల్లో కలిపి బంగ్లాదేశ్​ జాతీయ జట్టు తరఫున తమీమ్ 15,205 పరుగులు సాధించి లీడింగ్​ రన్​ స్కోరర్​గా నిలిచాడు.

తమీమ్​ ఇక్బాల్​ ట్రాక్​ రికార్డ్​..

ఫార్మాట్మ్యాచులుపరుగులుసెంచరీలుహాఫ్​ సెంచరీలుటాప్​ స్కోర్​
టెస్టులు705134 10 31 206
వన్డేలు241 8313 14 56 158
టీ20లు78 1758 17103*

Tamim Career : బంగ్లాదేశ్‌ తరఫున 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తమీమ్​ ఇక్బాల్ కొద్దికాలంలోనే స్టార్‌ క్రికెటర్​గా ఎదిగాడు. అదే ఏడాదే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించడంలో తమీమ్ కీలక పాత్ర పోషించాడు. గతేడాది ఇదే సమయంలో అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయంగా ప్రస్తుతం యాక్టివ్ క్రికెటర్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు తమీమ్ కావడం విశేషం. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్​గా తమీమ్ పేరిట రికార్డు ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.