ETV Bharat / sports

టెస్టుల్లో తొలి బంతికే వికెట్.. ఆసీస్ పేసర్ రికార్డు - ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషెస్ లేటెస్ట్ న్యూస్

AUS vs ENG Ashes 2021: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. యాషెస్ సిరీస్​లో తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్​గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఈ ఘనత సాధించాడు స్టార్క్.

Mitchell Starc record in ashes, Mitchell Starc first ball wicket, స్టార్క్ యాషెస్ రికార్డు, స్టార్క్ తొలి బంతికే వికెట్
Mitchell Starc
author img

By

Published : Dec 8, 2021, 11:53 AM IST

AUS vs ENG Ashes 2021: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతోన్న యాషెస్‌ టెస్టు సిరీస్‌లో మిచెల్ స్టార్క్‌ అరుదైన రికార్డు నమోదు చేశాడు. యాషెస్ సిరీస్​లో తొలి బంతికే వికెట్ తీసి చరిత్రకెక్కాడు. ఇతని కంటే ముందు 1936లో ఎర్నీ మెక్‌ కార్మిక్‌ తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఈ రెండు రికార్డులు బ్రిస్బేన్‌ మైదానంలోనే నమోదు కావడం గమనార్హం.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ జట్టుకు ఆరంభంలోనే మిచెల్ స్టార్క్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టార్క్ వేసిన తొలి బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో యాషెస్ సిరీస్​లో తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడీ ఆసీస్ స్పీడ్ స్టార్. కాగా, టెస్టుల్లో తొలి ఓవర్లోనే వికెట్ తీయడం స్టార్క్‌కిది 13వ సారి కావడం విశేషం.

ఆసీస్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్​లో 147 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్​ తొలి బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ (0) ను పెవిలియన్ పంపాడు స్టార్క్. తర్వాత మలన్ (6), రూట్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు హేజిల్​వుడ్. కాసేపటికే స్టోక్స్​(5).. కమిన్స్ బౌలింగ్​లో ఔటయ్యాడు. దీంతో 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. ఆ తర్వాత మరో ఓపెనర్ హసీబ్ హమీద్​తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు ఒల్లీ పోప్. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరు క్రీజులో కుదురుకుంటున్న సమయంలో హమీద్​ను​ (25)ను బోల్తా కొట్టించాడు కమిన్స్. ఆ తర్వాత పోప్(35), బట్లర్(39) కాసేపు పోరాడారు. వీరు కూడా ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. దీంతో 147 పరుగులతో సరిపెట్టుకుంది ఇంగ్లాండ్.

ఇవీ చూడండి: 'నా పదవీ కాలంలో అదే అత్యంత దారుణ ప్రదర్శన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.