Asian Games Cricket : ఆసియా క్రీడల్లో భాగంగా జరగుతున్న క్రికెట్ టోర్నీలో టీమ్ఇండియా మహిళల జట్టు దూసుకెళ్లింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడినప్పటికీ మలేసియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో తమదైన స్టైల్లో చెలరేగి సెమీస్‌లోకి అడుగుపెట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్లేయర్ షెఫాలీ వర్మ ధనాధన్ రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
మ్యాచ్ జరిగిందిలా..
India Vs Malaysia : వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా.. మైదానంలో పరుగుల వరదను పారించింది. ఇక షెఫాలీ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అందరిని అబ్బురపరిచింది. కేవలం 39 బాల్స్‌లోనే ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో కొట్టి 69 పరుగులను తన ఖాతాలోకి వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో షెఫాలీతో పాటు జెమియా రొడ్రిగస్ రాణించి జట్టును విజయ పథంలోకి నడిపించారు. ఆడిన 29 బాల్స్‌లో ఆరు ఫోర్లతో జెమియా 47 పరుగులు చేసింది. చివర్లో మైదానంలో దిగిన రిచా ఘోష్ ఏడు బాల్స్‌లోనే ఓ సిక్సర్, మూడు ఫోర్లతో 21 పరుగులు చేసింది. దీంతో 15 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి భారత మహిళల జట్టు 173 రన్స్ చేసింది.
అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా.. రెండు బాల్స్ కూడా ఎదుర్కొక ముందే మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేసిన మేనేజ్మెంట్.. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో మ్యాచ్ రద్దయినప్పటికీ.. రన్‌రేట్ ప్రకారం టీమ్ఇండియా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
-
The India women's cricket team, ranked 1st in Asia, made their debut in the history of the Asian Games.
— 19th Asian Games Hangzhou 2022 Official (@19thAGofficial) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Team India won 173/2 - 1/0 against Team Malaysia in the quarterfinal of women's cricket event at the 19th Asian Games Hangzhou.#Hangzhou #AsianGames #Cricket #TeamIndia… pic.twitter.com/jVYgWQzVPh
">The India women's cricket team, ranked 1st in Asia, made their debut in the history of the Asian Games.
— 19th Asian Games Hangzhou 2022 Official (@19thAGofficial) September 21, 2023
Team India won 173/2 - 1/0 against Team Malaysia in the quarterfinal of women's cricket event at the 19th Asian Games Hangzhou.#Hangzhou #AsianGames #Cricket #TeamIndia… pic.twitter.com/jVYgWQzVPhThe India women's cricket team, ranked 1st in Asia, made their debut in the history of the Asian Games.
— 19th Asian Games Hangzhou 2022 Official (@19thAGofficial) September 21, 2023
Team India won 173/2 - 1/0 against Team Malaysia in the quarterfinal of women's cricket event at the 19th Asian Games Hangzhou.#Hangzhou #AsianGames #Cricket #TeamIndia… pic.twitter.com/jVYgWQzVPh
ఇక ఆదివారం జరగనున్న తొలి సెమీస్‌లో భారత్ తలపడనుంది. అయితే, ఏ జట్టుతో అనేది శుక్రవారం తేలిపోనుంది. కేవలం ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు టీమ్ఇండియాకు పతకం ఖాయమవుతుంది. మరోవైపు తొలిసారి పురుషుల జట్టు కూడా ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 3న తొలి క్వార్టర్‌ఫైనల్‌లో భారత్ తలపడనుంది. అయితే, ఏ జట్టుతో అన్నది మాత్రం అక్టోబర్ 2 వరకు తెలియదు. ఇక పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి.
Asian Games 2023 : 15 పరుగులకే ఆలౌట్.. మహిళా టీ20ల్లో చెత్త రికార్డు
Asian Games 2023 : అతి పెద్ద క్రీడా సంబరానికి వేళాయే.. నీరజ్‌తో పాటు ఈ అథ్లెట్లపైనే ఆశలు