బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన తొలి రెండు మ్యాచుల్లోనూ టీమ్ఇండియా విజయం సాధించింది. ఫలితంగా 2-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ రెండు మ్యాచులు గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. బౌలర్ల విభాగంలో అశ్విన్.. 864 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు.
మరోవైపు చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా.. రీసెంట్గా ఈ టెస్ట్ సిరీస్‌తో టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే రెండు టెస్టులో పది వికెట్ల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు కూడా తాజా ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ముందుకు జరిగి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. 763 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. 2019 సెప్టెంబర్ తర్వాత జడేజా మళ్లీ తొలి పది స్థానాల్లోకి రావడం ఇదే తొలిసారి. ఇక గాయం కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరంగా పేస్ బౌలర్ బుమ్రా కూడా టాప్ 10లోనే కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకుల్లో అతడు 795 పాయింట్లతో తన ఐదో స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఇక కొంతకాలం నుంచి అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లాండ్ సీమర్ జేమ్స్ ఆండర్సన్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
ఇకపోతే తొలి రెండు మ్యాచుల్లో బ్యాట్‌తో రాణించిన అక్షర్ పటేల్.. ఆల్ రౌండర్ల విభాగంలో టాప్ 5లోకి దూసుకెళ్లాడు. ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంకా ఈ జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
బ్యాటర్ల విభాగంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), బాబర్ ఆజం(పాకిస్థాన్ కెప్టెన్) నిలిచారు. టీమ్ఇండియా బ్యాటర్లు రిషబ్ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ 6, 7వ స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 4K క్లారిటీతో మ్యాచ్‌లన్నీ ఫ్రీగా చూసేయొచ్చు!0222140204083083377