వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. ఒక్క పోస్ట్‌తో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాడు. నెట్టింట్లో తన నగ్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో అభిమానులంతా అవాక్కయ్యారు. మరికొంతమంది అతడిపై సెటైర్లు వేస్తున్నారు. అద్దం ముందు నిలబడి న్యూడ్‌గా తీసుకున్న సెల్ఫీని రస్సెల్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ప్రైవేట్ పార్ట్ కనబడకుండా పుర్రె బొమ్మ ఎమోజీతో కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు.
కాగా, ఇటీవలే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా న్యూడ్ ఫొటో షూట్ దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ న్యూడ్ ఫొటో షూట్‌కు రసెల్ది లైట్ వెర్షన్ అని సెటైర్లు పేల్చుతున్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ కోసం కేకేఆర్.. రస్సెల్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న రస్సెల్.. ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జిమ్‌లో గంటలు తరబడి చెమటోడ్చుతున్నాడు. వర్కౌట్స్‌కు సంబంధించిన సెల్ఫీని కూడా రస్సెల్ అభిమానులతో పంచుకున్నాడు.
- — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022
">— Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022
ఇదీ చూడండి: వెబ్‌సిరీస్‌గా 2007 టీ20 వరల్డ్‌కప్.. ఇక క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే!