పాక్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజంపై మళ్లీ లైంగిక ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. తన తోటి ఆటగాడి ప్రేయసితో బాబర్.. లైంగిక చాటింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసభ్యకర సందేశాల చిత్రాలతో పాటు, అతడి వ్యక్తిగత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇలాగే తనతో లైంగిక చాటింగ్ చేస్తే.. సదరు యువతి బాయ్‌ఫ్రెండ్‌ను జట్టు నుంచి బయటకు పంపనని బాబర్ హామీ ఇచ్చినట్లు చాటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాబర్‌పై తీవ్రవిమర్శలు వస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా బాబర్ నోరు మెదపకపోవడం గమనార్హం. ఇదంతా దుష్ప్రచారమనీ, ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవనీ బాబర్ అభిమానులు అంటున్నారు. రెండేళ్ల క్రితం కూడా బాబర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. వివాహం చేసుకుంటానని నమ్మించి తనను గర్భవతిని చేసినట్లు ఓ యువతి అప్పట్లో బాబర్ ఆజంపై తీవ్ర ఆరోపణలు చేసింది.
కాగా ఇదే తరహాలో బాబర్ అజామ్‌పై రెండేళ్ల కిందట కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనని వివాహం చేసుకొంటానని చెప్పి, గర్భవతిని చేశాడంటూ 2020లో బాబర్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. "బాబర్ క్రికెట్‌లోకి రాకముందు నుంచే నాకు తెలుసు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే కాలనీలో పెరిగాం. ఒకరితో ఒకరు కలిసి తిరిగాం. 2010లోనే నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. నేను కూడా అంగీకరించా. తర్వాత మా ఇంటికి వస్తూ ఉండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవడం పెరిగింది. పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలకు తెలియజేశాం. అయితే అతడి కుటుంబం అంగీకరించలేదు. దీంతో కోర్టు ద్వారా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. 2011లో పెళ్లి చేసుకొంటానని వాగ్దానం చేసి మరీ నన్ను ఓ ప్రాంతంలో ఉంచాడు. అయితే ఎప్పుడు చేసుకొందామని అడుగుతూనే ఉన్నా..కానీ బాబర్ మాత్రం దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో గర్భవతిని కూడా అయ్యా" అని సదరు మహిళ అప్పట్లో చెప్పింది.