బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఇంట్లో నిన్న సాయంత్రమే ఉరేసుకుంది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుమార్తె మృతిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఝాన్సీ మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. మాటీవీలో ప్రసారమవుతున్న పవిత్రబంధం సీరియల్లో ఆమె నటించింది.