బిగ్‌బాస్ సీజన్-5లో(nagarjuna bigg boss) అయిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం(అక్టోబర్ 4) ముగిసింది. గత నాలుగు వారాలకు పూర్తి భిన్నంగా ఈసారి నామినేషన్స్(bigg boss contestants telugu) తతంగాన్ని నిర్వహించారు. ప్రతి హౌస్‌మేట్ కన్ఫెషన్ రూమ్‌కు వచ్చి, హౌస్‌లో ఉండేందుకు అర్హతలేని, తమకు ఇష్టం లేని ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లను, అందుకు తగిన కారణాలను చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ సూచించాడు. ప్రతివారం ఫేస్ టు ఫేస్ జరుగుతున్న నామినేషన్స్(big boss nomination this week) ఈసారి గోప్యంగా జరుగుతుండటం వల్ల ఇంటి సభ్యులందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
షణ్ముఖ్‌కు అత్యధిక నామినేషన్స్
ఈ వారం షణ్ముఖ్‌ను(shanmukh bigg boss 5 telugu) అత్యధిక మంది నామినేషన్స్ చేశారు. గేమ్ సరిగా ఆడటం లేదని, ఎప్పుడూ కూర్చొని కబుర్లు చెబుతుంటాడని ఇలా ఒక్కో కారణం చెప్పి, ఒక్క జెస్సీ తప్ప హౌస్‌లో ఉన్న మెన్ అంతా అతడినే నామినేట్ చేయటం విశేషం. రవి తనను గేమ్ ఆడనీయకుండా చేస్తున్నాడని, గతవారం లోబో చేసిన పని కారణంగా బిగ్‌బాస్‌తో తిట్లు తిన్నానని జెస్సీ వాళ్లద్దరినీ నామినేట్ చేయటం బాగానే అనిపించింది. అనీ మాస్టర్ పూర్తిగా సేఫ్ గేమ్ ఆడుతూ రవి,విశ్వాలను నామినేట్ చేశారు. అలా ఈ వారం నామినేషన్స్‌లో షణ్ముఖ్, లోబో, సన్నీ, విశ్వ, హమీద, మానస్, ప్రియ, జస్వంత్, రవిలు నిలిచారు. హౌస్‌లో ప్రస్తుతం 15మంది ఉండగా 9మంది నామినేషన్స్‌లో ఉండటం గమనార్హం. అయితే, తాము ఎవరికి ఓటు వేశామో చెప్పడని ఊహించని హౌస్‌మేట్స్‌కు కాస్త గట్టిగానే షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఎవరెవరు? ఎవరిని నామినేట్ చేశారో స్క్రీన్‌పై చూపించే సరికి ఒక్కొక్కరి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అలా చూపించకుండా ఉండి ఉంటే ‘నేను నిన్ను గతవారం నామినేట్ చేయలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నా. పేర్లు చెప్పి బిగ్‌బాస్ మంచి పని చేశాడు’ అంటూ వచ్చే వారం నామినేట్ చేసేవారని సన్నీ చెప్పుకొచ్చాడు. అతనని అత్యధకమంది నామినేట్ చేయడంతో వీకెండ్‌లో నాగార్జున పచ్చిమిర్చి తిన్నప్పుడు కలిగిన మంటను షణ్ముఖ్ ఇప్పుడు బయటపెట్టాడు. ‘ఇప్పటివరకూ నా ఆట చూడలేదు. ఇక నుంచిచూస్తారు’ అంటూ జెస్సీ, సిరిలతో చెప్పాడు. హౌస్‌మేట్స్ అందరూ గ్రూప్‌గా ఏర్పడి, తనని నామినేట్ చేశారని వాపోతున్నాడు. అసలు విషయం ఏంటంటే,, జెస్సీ(shanmukh bigg boss 5 telugu), సిరి, షణ్ముఖ్‌లు ఒక గ్రూప్ ఉండటం విశేషం.
కిచెన్‌లో రచ్చ.. షణ్ముఖ్ ఓవరాక్షన్
వంట చేస్తున్న ప్రియాంక(bigg boss fight contestants) దగ్గరకు వచ్చిన హమీదా కర్రీలో ఎన్ని మటన్ ముక్కలు ఉన్నాయో లెక్కపెట్టమని అడిగింది. అలా సాధ్యం కాదని, ఒకటి ఎక్కువో తక్కువో అందరికీ వస్తుందని ప్రియాంక సర్ది చెప్పింది. అయినా కూడా హమీద పదే పదే ఆ ప్రశ్న అడగటంతో 'నువ్వే లెక్క పెట్టుకో' అంటూ అక్కడి నుంచి విసురుగా వచ్చేసింది. 'పదేళ్ల నుంచి వంట చేస్తున్నా. ఏది ఎలా చేయాలో నాకు తెలియదా? మటన్ కొట్టువాడు నాకేమైనా మొగుడా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కొద్దిసేపటి తర్వాత కిచెన్ వైపునకు వచ్చిన జెస్సీతో కెప్టెన్ శ్రీరామ్ రోటీల కోసం పిండిని ఉండలుగా చుట్టమన్నాడు. అయితే అది తన పని కాదని, ఇప్పటికే గిన్నెలు, కిచెన్ శుభ్రం చేస్తున్నానని చెప్పాడు. తాను ఆ పని చేయనని వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపం వచ్చిన శ్రీరామ్, సాయం చేయకపోతే 'ఎవరి వంట వాళ్లే చేసుకోవాలి' అనడంతో జెస్సీ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. షణ్ముఖ్, సిరి,కాజల్ దగ్గరకు వెళ్లి 'నాకు ఫుడ్ పెట్టరట. నన్నే వండుకుని తినమంటున్నారు' అంటూ ఊగిపోయాడు. వెంటనే కిచెన్‌లోకి వచ్చిన షణ్ముఖ్, సిరిలు శ్రీరామ్, ఇతర టీమ్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. 'విషయం తెలియకుండా మధ్యలో వచ్చి కలగజేసుకోవద్దు' అంటూ షణ్ముఖ్‌కు(shanmukh bigg boss 5 telugu) శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చాడు. 'నా ఫ్రెండ్ కోసం వచ్చా. ఫుడ్ పెట్టను అని చెప్పడానికి నువ్వెవరు' అంటూ షణ్ముఖ్, సిరిలు కోపంతో ఊగిపోయారు. అనీ మాస్టర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, జెస్సీ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. చివరకు శ్రీరామ్ వచ్చి, జెస్సీ, షణ్ముఖ్‌లకు ఆహారం తినిపించాడు.
ఇదీ చూడండి: Biggboss Season5: హౌస్‌మేట్స్ సర్‌ప్రైజ్.. షాక్‌లో నాగార్జున