ETV Bharat / sitara

షూట్‌కు 'వకీల్​సాబ్' రెడీ.. దసరాపై గురి! - పవన్ కల్యాణ్ తాజా వార్తలు

కరోనా లాక్​డౌన్ కారణంగా షూటింగ్​లు నిలిచిపోయాయి. అయితే జూన్ నుంచి చిత్రీకరణలు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీంతో దర్శకనిర్మాతలు తమ తమ ప్రాజెక్టులను తిరిగి సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్
పవన్
author img

By

Published : May 24, 2020, 4:52 PM IST

కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా స్తంభించి పోయిన చిత్ర పరిశ్రమలో నెమ్మదిగా సినిమాల సందడి షురూ కాబోతుంది. ఇప్పటికే నిర్మాణాంతర పనులు చేసుకోవడానికి పరిశ్రమకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. జూన్‌ నుంచి చిత్రీకరణలు కూడా ప్రారంభించుకోవచ్చని ఓ స్పష్టతనిచ్చేసింది.

ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలంతా తమ తమ ప్రాజెక్టులను తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడిలా సెట్స్‌పైకి వెళ్లబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం 'వకీల్‌సాబ్‌'పైనే ఉంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన తుది దశ చిత్రీకరణ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌రాజు.

మరో రెండు వారాల్లో చిత్రీకరణలకు అనుమతులు లభిస్తాయి కాబట్టి జూన్‌ నుంచి తన డేట్స్‌ ఇప్పించాలని దిల్‌రాజు ఇప్పటికే పవన్‌ను కోరారట. దీనికి ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్‌ - జులై నాటి కల్లా చిత్రీకరణను పూర్తి చేసి.. దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ఉన్నారట దిల్​రాజు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆగస్టు నాటికి కానీ థియేటర్లు తెరచుకునే పరిస్థితి లేదు. కాబట్టి అవి తెరచుకుని ప్రజలు కాస్త అలవాటు పడటానికి మరో రెండు నెలల సమయమైనా పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా దసరా సీజన్‌పై కన్నేసి ఉంచిందట 'వకీల్‌సాబ్‌' బృందం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.