ఇవీ చూడండి:అదా శర్మ.. అద్దరగొట్టిందంతే!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇటీవల 'మా'లో ఎన్నికల అనంతరం... విమర్శల పర్వం ఊపందుకుంది. తాజాగా తనపై నరేశ్ వర్గం చేస్తున్న ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. నటుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు.
శివాజీరాజా
గత నాలుగేళ్లుగా రాజకీయాలకు 'మా' కేంద్రమైందని మాజీ అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా అన్నారు.గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు రాజకీయాలు లేవని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఫలితాల తర్వాత తాను కార్యాలయానికే వెళ్లలేదని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా స్నేహితుడైన నాగబాబు తనకు గిఫ్ట్ ఇచ్చారని... త్వరలో ఆయనకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననీ చెప్పారు.
ఇవీ చూడండి:అదా శర్మ.. అద్దరగొట్టిందంతే!
sample description
Last Updated : Mar 19, 2019, 2:39 PM IST