హీరో కమల్‌హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా 'విక్రమ్'. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రతినాయకుడిగా డ్యాన్సర్, నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై దర్శకుడు లోకేష్.. లారెన్స్‌ను సంప్రదించి చర్చలు జరిపారని తెలిసింది.
అయితే చిన్నతనంలో హీరో రజనీకాంత్‌పై ఉన్న అభిమానంతో కమల్‌హాసన్ పోస్టర్‌పై పేడ విసిరినట్లు కొంతకాలం క్రితం లారెన్స్ చెప్పారు. అప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కమల్ అభిమానులు.. ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. మరి ఈ నేపథ్యంలో లారెన్స్.. కమల్ సినిమాలో నటిస్తారో లేదో చూడాలి.
ఇదీ చూడండి: రజనీ అభిమానులకు లారెన్స్ క్షమాపణలు