ETV Bharat / sitara

'ప్రభాస్​తో అందుకే కుదరలేదు.. త్వరలోనే కలిసి పనిచేస్తాం' - music director thaman prabhas movie

దాదాపుగా స్టార్ హీరోల సినిమాలన్నింటికీ స్వరాలు సమకూర్చిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్​(music director thaman about prabhas).. ప్రభాస్​తో కలిసి పనిచేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన అందుకు గల కారణాన్ని తెలిపారు. త్వరలోనే డార్లింగ్​తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

prabhas
ప్రభాస్​
author img

By

Published : Nov 23, 2021, 8:27 PM IST

Updated : Nov 23, 2021, 9:39 PM IST

క్లాస్‌, మాస్‌, మెలోడీ అనే భేదం లేకుండా ఇండస్ట్రీలోని బడా హీరోలందరికీ గుర్తుండిపోయే మ్యూజిక్ ఆల్బమ్స్‌ అందించారు సంగీత దర్శకుడు తమన్‌(music director thaman about prabhas). త్వరలోనే ఈయన స్వరాలు సమకూర్చిన 'అఖండ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపిన ఆయన.. 'అఖండ' రెగ్యులర్​ కమర్షియల్​ ఫిల్మ్​ కాదని అన్నారు. ఈ మూవీలో బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ హైలైట్​గా నిలుస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే స్టార్​ హీరోలందరితో పనిచేసిన ఆయన రెబల్​స్టార్​ ప్రభాస్​తో కలిసి ఎందుకు పనిచేయలేదో వివరించారు.

దాదాపు పదేళ్ల క్రితమే డార్లింగ్​తో 'రెబల్'​ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు తమన్​. అయితే ఆ సమయంలో ఆ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్​తో విభేదాలు రావడం వల్ల మూవీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపారు. కానీ వీలైనంత వరకు త్వరలోనే ప్రభాస్​తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం తమన్​ 'అఖండ'తో పాటు 'గని', 'సర్కారువారి పాట', 'థ్యాంక్యూ', 'భీమ్లానాయక్'​, 'గాడ్​ఫాదర్'​, రామ్​చరణ్​ 'ఆర్​సీ 15', మహేశ్​బాబు 'ఎస్​ఎస్​ఎమ్​బీ 28' చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: షాహిద్​ 'జెర్సీ' ట్రైలర్​.. 'శ్యామ్​సింగరాయ్​', 'అత్రాంగి రే' అప్డేట్స్​

Last Updated : Nov 23, 2021, 9:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.