ETV Bharat / sitara

ఫొటోషూట్ వివాదంపై శోభిత క్లారిటీ - sobhita dhulipala magazine cover controversy

బాలీవుడ్ నటి శోభితా దూలిపాళ ఇటీవల ఓ మ్యాగజైన్​ ఫొటోషూట్​లో పాల్గొంది. ఈ ఫొటోలను నెట్టింట పంచుకుంటూ తానే స్వయంగా సెల్ఫ్ టైమర్​తో ఫొటోషూట్​ చేసుకున్నానని చెప్పింది. అయితే ఇందులో ఓ వ్యక్తి ఉండటం వల్ల శోభిత అబద్ధం చెప్పిందంటూ కామెంట్లు పెట్టారు నెటిజన్లు. దీనిపై తాజాగా ఈ హీరోయిన్ స్పందించింది.

శోభిత
శోభిత
author img

By

Published : Apr 25, 2020, 7:40 PM IST

అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన 'గూఢచారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి శోభితా దూళిపాళ. ఇటీవల ఆమె ఓ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. "లాక్‌డౌన్‌ కారణంగా మా ఇంటి దగ్గరే ఈ ఫొటోషూట్‌ చేసుకున్నాను. నాకు నేనే మేకప్‌ వేసుకుని, సెల్ఫ్‌ టైమర్‌తో స్వయంగా నేనే ఫొటోలు తీసుకున్నా." అని శోభిత పేర్కొంది. అయితే ఈ ఫొటోలు బయటకు రావడం వల్ల అందులోని ఓ ఫొటోలో ఆమెను మరో వ్యక్తి ఫొటో తీస్తున్నట్లు ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. "శోభిత అబద్ధం చెప్పింది. సెల్ఫ్‌ టైమర్‌ పెట్టి ఫొటోషూట్‌ చేస్తే ఈ ఫొటోగ్రాఫర్‌ ఏం చేస్తున్నాడు" అంటూ విపరీతంగా కామెంట్లు పెట్టారు.

తాజాగా దీనిపై శోభిత వివరణ ఇచ్చింది. "నెటిజన్ల ట్రోలింగ్‌ గురించి విని ఎంతో బాధపడ్డాను. పూర్తి విషయం తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి ఎలా వస్తారో అనిపించింది. దీనివల్ల నేను ఒక విలువైన పాఠం నేర్చుకున్నా. నా ఫొటోషూట్‌ ఎలా జరిగిందో మీకు చెప్పాలని భావిస్తున్నా.

1. ఫొటోషూట్‌ కోసం రెడీ అయ్యాక.. ఓ కాఫీ కప్పు, నా ఫోన్‌తో ఫొటోషూట్‌ తీయడానికి మా టెర్రస్‌ పైకి వెళ్లాను.

2. ఆ సమయంలో టెర్రస్‌పై చాలామంది వ్యక్తులు ఉన్నారు. నేను ఫొటోలు తీసుకోవడంలో ఇబ్బంది పడడం చూసిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి సాయం చేస్తానని చెప్పారు.

3.నాకు కావాల్సిన విధంగా కొన్ని ఫొటోలు తీయించుకున్న తర్వాత అతనికి థ్యాంక్స్‌ చెప్పాను. అతను అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కానీ నేను మ్యాగజైన్‌ కవర్‌ ఫొటో కోసం పంపించిన ఫొటోలు ఏవీ కూడా అతను తీసిన ఫొటోలు కావు. నా సొంతంగా సెల్ఫ్‌ టైమర్‌ పెట్టుకుని తీసుకున్న ఫొటోలే. ఇప్పుడు మీరు ట్రోల్‌ చేస్తున్న ఆ ఫొటోను కూడా నేనే నెట్టింట్లో పోస్ట్‌ చేశాను. ఆ ఫొటోలు పోస్ట్‌ చేసినప్పుడే క్యాప్షన్‌ ఇచ్చి ఉండాల్సింది." అని స్పష్టతనిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.