ETV Bharat / sitara

Chiru 154 movie: చిరుకు జోడీగా శ్రుతిహాసన్​? - chiru acharya release date

Chiru shruthi hassan: ఓవైపు బాలయ్యతో సినిమా చేస్తున్న ముద్దుగుమ్మ శ్రుతిహాసన్.. ఇప్పుడు చిరంజీవితో జోడీగా నటించేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ విషయమై త్వరలో ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi Shruti Haasan
చిరంజీవి శ్రుతిహాసన్
author img

By

Published : Jan 7, 2022, 6:23 AM IST

నటి శ్రుతిహాసన్‌ తెలుగులో మళ్లీ బిజీ అవుతోంది. ఓవైపు ప్రభాస్‌తో కలిసి 'సలార్‌'లో సందడి చేస్తున్న ఈ అమ్మడు.. మరోవైపు బాలకృష్ణ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలిపింది. ఇప్పుడామె చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Chiru bobby movie: ప్రస్తుతం చిరు హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం చిత్రబృందం శ్రుతిని సంప్రదించినట్లు తెలిసింది.

Chiru 154 movie
చిరు-బాబీ మూవీ

చిత్ర కథ.. ఆమె పాత్ర నచ్చడం వల్ల ఈ సినిమా చేసేందుకు శ్రుతిహాసన్‌ అంగీకరించినట్లు తెలుస్తుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం కోసం 'వాల్తేరు వీరయ్య' టైటిల్‌ పరిశీలనలో ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.