'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' లాంటి విభిన్నహాస్య చిత్రాలతో నటుడిగా సంపూర్ణేశ్‌బాబు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఇప్పుడాయన హీరోగా నటించిన కొత్త సినిమా 'బజార్ రౌడీ'. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. శుక్రవారమే(ఆగస్టు 20) థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
*నేనిప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఈ కథ విషయానికొస్తే.. చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి నేను ఓ బజార్ రౌడీగా ఎదుగుతా. అయితే నేనలా రౌడీగా మారడానికి వెనుక ఓ బలమైన కారణముంటుంది. మరి అదేంటి? రౌడీగా మారి నేనేం సాధించా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
* రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన మాట వాస్తవమే. నాకింద ఉప్పు బస్తాలు ఉండటం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డా. లేదంటే కాలో.. చెయ్యో విరిగిపోయేది. ప్రమాదం జరిగిన వెంటనే నిర్మాత షూట్ ఆపేద్దామన్నారు. నేను పెద్ద నటీనటులతో పని చేస్తున్నందున నాకు ఆ నొప్పి తెలియలేదు. వెంటనే షూట్‌లో పాల్గొన్నాను.
* ప్రస్తుతం నేను చేసిన 'కాలీఫ్లవర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 'సోదరా' అనే మరో చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. యన్.ఆర్.రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు 70శాతం పూర్తయింది. 'పుడింగి నెంబర్ వన్' 30శాతం అయిపోయింది. వీటితో పాటు ఐదు పాత్రలుండే ఓ సినిమా చేస్తున్నా. అలాగే 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' ఫేం ఈశ్వర్‌తో ఓ ప్రాజెక్ట్ రెడీగా ఉంది.
ఇవీ చదవండి: