ETV Bharat / sitara

'RRR' మేకింగ్ వీడియో.. ఈ విషయాలు గమనించారా? - RRR ram charan ntr

అభిమానుల్లో జోష్ నింపేందుకు 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరిట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. చాలా ఎక్కువ షాట్లతో ఉన్న వీడియోలో కొన్ని అంశాలు ఆసక్తిగా అనిపించాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

RRR making video.. detailed explonation
ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో
author img

By

Published : Jul 15, 2021, 9:22 PM IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు రాజమౌళి ఈ రోజు ఉదయం కడుపునిండా తిండి పెట్టారు. సినిమా ఎలా వస్తుంది, ఏమవుతుంది అనే ఆలోచన ఎవరికీ లేదు. అయితే తినబోయే ముందు రుచి చూస్తే వచ్చే మజానే వేరు అంటారు కదా. అందులో రాజమౌళి వండిన వంటకం పిసరంత రుచి చూసినా మజానే. అలా అభిమానుల కోసం రాజమౌళి ‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ ఓ మేకింగ్‌ వీడియో విడుదల చేశారు. వీడియోను మీకు ఇప్పటికే చాలా సార్లు చూసుంటారు. 108 సెకన్ల ప్రోమోలో రాజమౌళి సినిమా గురించి, పాత్రల గురించి, వాళ్లు పడుతున్న కష్టం గురించి... ఇలా చాలా విషయాలు చెప్పేశారు. ఫ్రేమ్‌లు టక్‌ టక్‌ మని అలా వచ్చి వెళ్లిపోతాయి. అందుకే చూసేటప్పుడు కొన్ని మిస్‌ అయ్యే అవకాశం కూడా ఉంది. మాకు అనిపించిన కొన్ని మంచి ఫ్రేమ్‌లు ఇక్కడ మీ కోసం...

  1. రాజమౌళి సినిమా అంటే సెట్స్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ‘బాహుబలి’ ప్రచార చిత్రాల్లోనూ వాటినే ప్రధానం చూపించారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్ఆర్‌’ విషయంలోనూ అంతే. వీడియో మొదటి రెండు ఫ్రేమ్‌లు సినిమా కోసం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా రూపొందించిన షాట్లే కనిపిస్తాయి.
    .
    .
    .
    .
  2. హీరో ఎలా నటించాలో చెప్పేవాడు దర్శకుడు. దాని కోసం ముందు దర్శకుడు నటించాల్సి ఉంటుంది. నేటితరం దర్శకుల్లో రాజమౌళి తర్వాతే ఎవరైనా అంటుంటారు. కావాలంటే పై ఫ్రేమ్‌ చూడండి... ఎంత దర్జాగా హీరో లెక్కన ఉన్నారో.
    .
    .
  3. రాజమౌళి మనసును బాగా చదువుతారో, లేక ఈయన కళ్లను రాజమౌళి కళ్లలా మార్చుకొని ఆలోచిస్తారో కానీ.. సెంథిల్‌ కుమార్‌ కెమెరా రాజమౌళి ఆలోచనల్ని భలేగా చూపిస్తుంది. అందుకే వీడియోలో రాజమౌళి తర్వాత కనిపించింది మన సెంథిల్‌ కుమారే.
    .
    .
  4. సినిమా ఎప్పుడూ గ్రూప్‌ వర్కే. రాజమౌళి కూడా అదే మాట అంటుంటారు. అందుకే వీడియోలో ‘మాస్టర్‌ స్టోరీ టెల్లర్‌ అండ్‌ హిజ్‌ టీమ్‌’ అనే రాశారు. ఇదిగో పై ఫ్రేమ్‌లో ఉన్నది ఆ టీమ్‌లో కొంతమంది మాత్రమే.
    .
    .
  5. రాజమౌళి సినిమా కథ, కథనం ఎలా ఉండాలో చూసుకుంటే... ఆయన సతీమణి రమ నటీనటుల దుస్తుల విషయంలో శ్రద్ధ పెడతారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కదా మరి. ఇక్కడ ఆమె అదే పనిలో ఉన్నారు మరి.
    .
    .
  6. రాజమౌళికి ఉన్న అతిపెద్ద ఆస్తి... తండ్రి విజయేంద్ర ప్రసాద్‌. ఆయన కథ అందిస్తే సినిమాకు సగం విజయం దక్కినట్లే అంటారు. విజయేంద్ర ప్రసాద్‌తోపాటు ఎస్‌.ఎస్‌.కాంచి, త్రికోటి కూడా రాజమౌళి కీలక సినిమా నిర్ణయాలు, ఆలోచనల్లో ఉంటారు. కావాలంటే పై ఫ్రేమ్‌ చూడండి.
    .
    .
    .
    .
  7. తీసేవి భారీ సినిమాలు, వాటిని ముందుగా మినియేచర్లుగా చేసుకుంటే పని సులభం. రాజమౌళి అవలంభించే మార్గాల్లో ఇదొకటి. పై ఫ్రేమ్‌లో ఆయన, సాబుసిరిల్‌ తదితరులు ఆ మినియేచర్‌ దగ్గరే ఉన్నారు. ఇంకో ఫ్రేమ్‌లో మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ రాసిన స్క్రిప్ట్‌ చూస్తున్నారు. పక్కనే త్రికోటిని చూడండి... ఎంత శ్రద్ధగా ఉన్నారో.
    .
    .
    .
    .
  8. రోజుల తరబడి రాసుకొని, సిద్ధం చేసుకున్న కథ, సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు... వాటిని అంతే అందంగా,అర్థమయ్యేలా చెప్పాలి. రాజమౌళి అందులో దిట్ట అంటుంటారు. అందుకే అంతమంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లను దగ్గరకి పిలిచి ఎంత పొద్దిగ్గా వివరిస్తున్నారో చూడండి.
    .
    .
  9. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశంలోనే భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా అంటున్నారు. అంతటి సినిమా నిర్మాణ బాధ్యతలు మోస్తోంది ఈయనే డీవీవీ దానయ్య.
    .
    .
  10. సినిమా కాన్సెప్ట్‌ను చెబుతున్నప్పుడు రాజమౌళి... ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లో ఒకరు నీరు, ఒకరు నిప్పు అని చెప్పారు. దానికి రిఫరెన్స్‌గా వీడియోలు కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో కూడా ఆ రిఫరెన్స్‌ కనిపిస్తుంంది. పై రెండు ఫ్రేమ్‌లు దానివే.
    .
    .
    .
    .
  11. సినిమా చూసినప్పుడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ యాడ్‌ చేయడం వల్ల స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ప్రాంతాల్లా కనిపిస్తాయి కానీ. షూటింగ్‌ ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే చేశారు. చిత్రీకరణ జరిపిన ప్రదేశాల్లో కీలకమైనవాటిలో ఇదొకటి. ఇక్కడే రకరకాల స్టంట్లు చేశారు మన హీరోలు.
    .
    .
  12. వీడియోలో హీరోల కంటే ముందు ఎంటర్‌ అయ్యింది శ్రియనే. ఓ సీన్‌ అయ్యాక మోనిటర్‌లో ఎలా ఉందో చూసుకుంటున్న సందర్భం ఇది. ఆ వెంటనే వైవిధ్య నటుడు సముద్ర ఖని కనిపిస్తారు.
    .
    .
  13. ఇప్పుడు హీరోస్‌ టైమ్‌. మా అభిమాన హీరోలు ఎక్కడా అనుకుంటూనే.. అభిమానులు వీడియో చూస్తుంటే చమక్కున మెరుస్తారు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. ఇద్దరినీ చూడటానికి రెండు కళ్లు చాలవనుకోండి.
    .
    .
    .
    .
  14. రాజమౌళి పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని చాలా సార్లు విన్నాం. కొన్ని సినిమా మేకింగ్‌ వీడియోలు, సినిమాల్లో చూశాం. ఇప్పుడు ‘ఆర్ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియోలోనూ అలాంటి ఓ ఫ్రేమ్‌ ఉంటుంది. ఓ చిన్నారి భయపడుతున్న ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చినప్పుడు ఔట్‌ ఫోకస్‌లో రాజమౌళి తదేకంగా ఆమెనే పరిశీలిస్తుంటారు.
    .
    .
  15. జక్కన్న సినిమాల్లో పిల్లల పాత్రల ఎప్పుడూ కీలకమే. కథను ముందుకు నడపడంలో, ఎలివేషన్‌ ఇవ్వడంలో పిల్లలను జక్కన్న ఎక్కువగా వాడుతుంటారు. పై ఫ్రేమ్‌లో ఉన్న పిల్లాడు కూడా అలానే ఉన్నాడు.
    .
    .
  16. వీడియోలో ఒలీవియా మోరిస్‌ను ఒక్కసారే చూపించారు. కనిపించిన ఆ కాస్త క్షణాలైనా.. స్క్రీన్‌ ప్రజెన్స్‌ అయితే సూపర్‌ ఉంటుంది.
    .
    .
  17. వీడియోలో వావ్‌ అనిపించే ఫ్రేమ్‌ల్లో ఇదొకటి అని చెప్పొచ్చు. స్క్రీన్‌లో తారక్‌, రాజమౌళి ఒకేసారి కనిపిస్తారు. జక్కన్న మోనిటర్‌లో ఎన్టీఆర్‌ను పరిశీలిస్తున్నప్పుడు... ఆ ఫ్రేమ్‌ను తీసుకొని మేకింగ్‌ వీడియో ఫ్రేమ్‌లో వేశారు.
    .
    .
  18. సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ అన్నాక రోప్‌ వైర్స్‌ కామన్‌. వంటి చుట్టూ రోప్స్‌ ఉన్నా... యాక్షన్‌ సీన్స్‌ అంటే మనకు భయమే. కానీ మన హీరోలు చేసేస్తుంటారు. పై ఫొటోల్లో చూస్తే తారక్‌, రామ్‌చరణ్‌తోపాటు సినిమాటోగ్రాఫర్‌ కూడా గాల్లో ఎగురుతున్నారు. హీరోల ఫీట్లు మీకు చూపించాలంటే కెమెరామెన్‌లు కూడా ఫీట్లు చేయాల్సిందే మరి.
    .
    .
    .
    .
    .
    .
  19. గతంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన ప్రోమో వచ్చినప్పుడు ఓ సీన్‌ భలే అనిపించింది. అదే అడవిలో ఎన్టీఆర్‌ పరిగెత్తుకుంటూ వచ్చే సన్నివేశం. అదెలా తీశారో పై ఫ్రేమ్‌లో చూసేయొచ్చు. ఇక్కడే ఇలా ఉందంటే... సినిమా స్క్రీన్‌లో చూస్తే అరుపులే.
    .
    .
  20. వీడియోలో మొదట్లో రామ్‌చరణ్‌ను పోలీసు యూనిఫామ్‌లో చూపించారు జక్కన్న. అయితే ఆఖరికి వచ్చేసరికి క్లోజ్‌ కెమెరా పెట్టి... ఇంటెన్సిటీ చూపించారు. మామూలుగా చరణ్‌ కళ్లలో మ్యాజిక్‌ ఉంటుంది అంటారు. పై ఫ్రేమ్‌ చూస్తుంటే డబుల్‌ మ్యాజిక్‌ పండేలా ఉంది.
    .
    .
  21. ఎన్టీఆర్‌ నవ్వు ఎంత బాగుంటుందో... సీరియస్‌నెస్‌ కూడా అంతే బాగుంటుంది. ఈ వీడియో ఆఖరులో సీరియస్‌ ఎన్టీఆర్‌ను చూపించారు. ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ... ఆ లుక్ అయితే కేకే.
    .
    .
  22. మొన్నామధ్య విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియా భట్‌ పాత్ర హైలైట్‌ అన్నారు. అయితే ప్రేక్షకులకు ఎక్కడో చిన్న డౌట్‌ సీత పాత్రలో ఆలియా ఎలా ఉంటుందా అని. అయితే ఈ ఒక్క ఫ్రేమ్‌తో ఆలియా మొత్తం అనుమానాలను పటాపంచలు చేసేసింది.
    .
    .
  23. అజయ్‌ దేవగణ్‌కు సంబంధించి ఇప్పటివరకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీమ్‌ పెద్దగా చెప్పింది లేదు. ఓ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ మాత్రం విడుదల చేశారు. అయితే మేకింగ్‌ వీడియో ఆఖరులో అజయ్‌ ఫ్రేమ్‌ వేశారు. ఈ సినిమా ఆయన ప్రజెన్స్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండబోతోందనే ఫీల్‌ ఇచ్చారు.
    .
    .
  24. ఇక ఆఖరుగా... చాలామందికి ఉన్న అనుమానాలను చిత్రబృందం మరోసారి క్లియర్‌ చేసే ప్రయత్నం చేసింది. అక్టోబరు 13న సినిమాను కచ్చితంగా విడుదల చేస్తాం అంటూ ప్రకటించేసింది.
    .
    .
    .
    .
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.