ETV Bharat / sitara

Rajamouli: 'తారక్‌, చరణ్‌ వేర్వేరు ధ్రువాలు.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం కలిశారు' - ఆర్ఆర్​ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

"చరణ్‌, తారక్‌.. ఓ స్థాయికి వెళ్లాలనుకుంటున్నారు.. కానీ, ఇద్దరి ప్రయాణం వేరు" అని చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. దక్షిణ ధ్రువం ఒకరైతే ఉత్తర ధ్రువం మరొకరని అన్నారు.

RRR movie
ఆర్‌ఆర్‌ఆర్‌
author img

By

Published : Dec 28, 2021, 7:42 AM IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఇద్దరూ ఓ స్థాయికి వెళ్లాలనుకుంటున్నారని, ఆ ఇద్దరి ప్రయాణం వేరని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ ఇద్దరు హీరోలతో రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. చెన్నై నగరం వేదికగా నిలిచిన ఈ వేడుకకు కోలీవుడ్‌ నటులు శివ కార్తికేయన్‌, ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

RRR movie
'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "నాకంటే తానే సీనియర్‌ అని తారక్‌ ఎప్పుడూ గొడవపడుతుంటాడు. రామ్‌ చరణ్‌ చెప్పినట్టు తారక్‌ది చైల్డ్‌ మెంటాలిటీ, లయన్‌ పర్సనాలిటీ. తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టం. టైమ్‌ సెన్స్‌ లేదని తననెప్పుడూ తిడుతూనే ఉంటా. ఎందుకంటే 7గంటలకు సెట్‌కు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు. యాక్షన్‌ అంటే చాలు నా మనసులో ఏం ఉందో దాని చేసేస్తాడు. ఇలాంటి నటుడు దొరకటం నా ఒక్కడి అదృష్టం, టాలీవుడ్‌ అదృష్టం మాత్రమే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమ అదృష్టం. ఇన్నేళ్లుగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ఉన్నందుకు తారక్‌కి చాలా చాలా థ్యాంక్స్‌".

RRR movie
రాజమౌళి

"చరణ్‌ను 'మై హీరో' అంటుంటా. ఎలాంటి ఒత్తిడి లేకుండా క్లియర్‌ మైండ్‌తో సెట్‌కు వస్తాడు. 'మీకేం కావాలి. దాన్ని నేను ఎలా చేయగలను' అని ఆలోచించే మెంటాలిటీ తనది. ఇలాంటి మెంటాలిటీని నేను ఎవరిలోనూ చూడలేదు. చరణ్‌, తారక్‌.. ఓ స్థాయికి వెళ్లాలనుకుంటున్నారు. కానీ, ఇద్దరి ప్రయాణం వేరు. దక్షిణ ధ్రువం ఒకరైతే ఉత్తర ధ్రువం మరొకరు. ఈ రెండు ధ్రువాలు 'ఆర్‌ఆర్‌ఆర్‌' అనే అయస్కాంతానికి అతుక్కునందుకు నేనెంతో ఆనందిస్తున్నా. 'బాహుబలి'లానే 'ఆర్‌ఆర్‌ఆర్‌' మిమ్మల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.

RRR movie
తారక్‌, చరణ్‌

ఇదీ చూడండి:

రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్ట్ 'మహాభారతం'లో చరణ్-ఎన్టీఆర్

'రాజమౌళిని నమ్మి రూ.1000 కోట్లయినా పెటొచ్చు'

'ఆర్ఆర్ఆర్'లోని ప్రతి సీన్​ మళ్లీ చేసేందుకు రెడీ: ఎన్టీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.