ETV Bharat / sitara

'సల్మాన్‌.. మిమ్మల్ని టచ్​ చేయొచ్చా..?' - సల్మాన్​ఖాన్ ప్రగ్యా జైశ్వాల్

Pragya Jaiswal Salman Khan: కండలవీరుడు సల్మాన్​ఖాన్​తో తన అనుభవాల్ని పంచుకుంది 'అఖండ' బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్​. ఓ పాట షూటింగ్​లో భాగంగా.. సల్మాన్​.. మిమ్మల్ని తాకొచ్చా? అని అడిగానని చెప్పింది. మరి దానికి సల్మాన్ సమాధానం ఏంటి?

pragya jaiswal salman khan
సల్మాన్​ఖాన్​
author img

By

Published : Jan 25, 2022, 7:01 AM IST

Pragya Jaiswal Salman Khan: 'కంచె'చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి ప్రగ్యా జైశ్వాల్​. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా.. ఇటీవల విడుదలైన బాలకృష్ణ 'అఖండ'చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది.

అయితే తాజాగా సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఆడిపాడింది. 'మై ఛలా..' అంటూ సాగే వీడియో గీతంలో ఈ జంట సందడి చేసింది. ఇటీవల విడుదలైన ఈ గీతానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సల్మాన్‌తో నటించిన క్షణాల్ని గుర్తుచేసుకొంది ప్రగ్య.

"సల్మాన్‌ను ఆ పాట సెట్లోనే తొలిసారి కలిశాను. నాకు అక్కడ విషయాలేవీ తెలియవు. సల్మాన్‌ లాంటి వ్యక్తిని తొలిసారి కలుస్తున్నప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మంచిది కదా అనిపించింది. ఆయన పక్కన నటిస్తున్నాను కదా అని చనువుగా వ్యవహరిస్తే లేనిపోని సమస్యలు రావొచ్చేమో అనుకున్నాను.

అందుకే తొలి రోజు షూటింగులో 'నేను మిమ్మల్ని తాకొచ్చా?. ఇది రొమాంటిక్‌ గీతం. ఇద్దరి మధ్య కెమిస్ట్రి బాగుంటేనే పాట బాగా వస్తుంది' అని అడిగాను. 'దానికేముంది..నన్ను తాకొచ్చు' అన్నారాయన.

ఆయన మంచిగా ఉన్నారని అనుమతి లేకుండా చనువు తీసుకుంటే 'ఆమె కాస్త ఓవర్‌ చేస్తుంది అనుకుంటే బాగోదు కదా' అంటూ తన అనుభవాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ప్రగ్య. 'మై ఛలా..' గీతాన్ని సల్మాన్‌ స్నేహితురాలు లులియా, గాయకుడు గురు రంద్వా కలిపి ఆలపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్​' బ్యానర్​లో ప్రభాస్​ కొత్త సినిమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.