Prabhas movies: డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు! ఇప్పటికే నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. యువ దర్శకుడు మారుతితో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారట.
హారర్ కామెడీ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. దీనికి 'రాజా డీలక్స్' అని టైటిల్ కూడా అనుకుంటున్నారని సమాచారం. 'ఆర్ఆర్ఆర్' ఫేమ్ డీవీవీ దానయ్య.. ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ ఏడాది వేసవి తర్వాత షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ప్రభాస్ 'రాధేశ్యామ్'.. వాయిదా పడింది. మార్చిలో ఇది థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దర్శకులు నాగ్ అశ్విన్ 'ప్రాజెక్టు కె', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమాలు కూడా ప్రభాస్ చేస్తున్నారు. ఇప్పుడు మారుతితో పనిచేసేందుకు రెడీ అయి అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి:
- 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
- Salar movie: ఒక్క ఫైట్ సీన్ కోసం అన్ని కోట్లా?
- టాలీవుడ్ రేంజ్ పెరిగింది.. ప్రపంచం మన 'సినిమా' చూస్తోంది!
- Prabhas spirit: ప్రభాస్.. తొలిసారి పోలీస్ రోల్లో
- 'ప్రభాస్ గురించి హాలీవుడ్ ఆరా.. 'ప్రాజెక్ట్ కే' రిలీజ్ ఎప్పుడంటే?'
- ఫ్యాన్స్ కోసం ప్రభాస్ 'రాధేశ్యామ్' చేశారు: పూజా హెగ్డే