ETV Bharat / sitara

వాళ్లే నా జీవితాన్ని నాశనం చేశారు: పూనమ్ కౌర్ - poonam kaur latest

Poonam Kaur Latest News: సినిమా ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేసినట్లు సినీనటి పూనమ్​ కౌర్​ ఆరోపించారు. మూడేళ్లుగా వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగానూ ఎంతో నష్టాన్ని అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు.

Poonam Kaur
పూనమ్ కౌర్
author img

By

Published : Mar 8, 2022, 5:27 PM IST

Poonam Kaur Latest News: సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేసి మధ్యతరగతి యువతి పెళ్లి కలను చెదరగొట్టారని ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ ఆరోపించారు. ఎన్నో పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా చుట్టూ ఉండే రావణులు చెడగొట్టారని విమర్శించారు. తన తాజా చిత్రం 'నాతిచరామి' ఓటీటీ వేదికగా విడుదలవుతున్న సందర్భంగా 'ఈటీవీ'తో ప్రత్యేకంగా మాట్లాడారు పూనమ్ కౌర్.

"సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే కుటుంబంలో పుట్టాను. నన్ను కుటుంబసభ్యులు ఒక దేవతగా పెంచారు. మూడేళ్లుగా వ్యక్తిగతంగానూ, ఆరోగ్యపరంగానూ ఎంతో నష్టాన్ని అనుభవించాను. అయినా వెనకడుగు వేయకుండా సీతాదేవి, ద్రౌపది, దుర్గాదేవిల స్ఫూర్తితో మళ్లీ చిత్ర పరిశ్రమలో గెలుపు కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టాను."

-- పూనమ్​ కౌర్, సినీనటి

ఎన్నో ఆటంకాలు, వేధింపులు ఎదురవుతున్నా తన తల్లి తోడుగా ఉండటం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని పూనవ్ కౌర్ తెలిపారు. మధ్యతరగతి కుటుంబాల్లోని యువతల పెళ్లి ఆశలు, కలలకు ప్రతీకగా 'నాతిచరామి' చిత్రంలో తన పాత్ర ఉంటుందని పేర్కొన్నారు.

పూనమ్ కౌర్ తాజా

ఇదీ చూడండి: భార్యకు విడాకులు ఇచ్చిన ప్రముఖ దర్శకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.