ETV Bharat / sitara

ముందు రక్షకుడు.. ఆ తర్వాత వస్తున్న రాక్షసుడు - నానీ వి చిత్రం

నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్​బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వి'. వీరిద్దరి ఫస్ట్‌లుక్​లను త్వరలో విడుదల చేయనున్నారు. ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Nani's 25th film sees him team up with his first director Mohan Krishna Indraganti
ఒకే వేదికపై రాక్షసుడు.. రక్షకుడు
author img

By

Published : Jan 22, 2020, 8:30 AM IST

Updated : Feb 17, 2020, 11:03 PM IST

హీరో నాని విలన్​గా నటిస్తున్న సినిమా 'వి'. సుధీర్​బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నేచురల్ స్టార్ తొలిసారి ప్రతినాయకుడిగా కనిపిస్తుండటం వల్ల చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలో వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్​లుక్​లు రానున్నాయి.

"కృష్ణుడు గీతలో ఎప్పుడో చెప్పారు.. "రాక్షసుడు" ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు.. "రక్షకుడు" వస్తున్నాడు.. జనవరి 27న నా ఫస్ట్​లుక్ రానుంది".. అని నానిని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు హీరో సుధీర్​బాబు. "ఓహో.. అలాగా.. సరే! రాక్షసుడు ఫస్ట్‌లుక్‌లో జనవరి 28న మీ ముందుకు వస్తున్నాను" అని నాని రీట్వీట్ చేశాడు.

విభిన్న కథల ఎంపికలో నాని

తన కెరీర్‌ ప్రారంభం నుంచి విభిన్న కథలు ఎంచుకుంటూ సాగుతున్న నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే, ఈసారి ఏకంగా విలన్‌గా కనిపిస్తుండటం వల్ల సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. నానిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడే ఈసారి విలన్‌గా చూపించబోతున్నాడు. ఇందులో సుధీర్‌ సరసన అదితిరావు హైదరీ, నానికి జోడీగా నివేదా థామ‌స్‌ కనిపించనున్నారు. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: కథ నచ్చితే ఎలాంటి పాత్రైన చేస్తా: బాబీసింహా

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Wednesday 22nd January 2020
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction following the draw for the CAF's second qualifying round in preliminary competition to reach the 2022 World Cup. Already moved.  
SOCCER: Manager reactions following selected Premier League fixtures, including:
Everton 2-2 Newcastle United. Already moved.
Sheffield United 0-1 Manchester City. Already moved.  
Chelsea 2-2 Arsenal. Already moved.  
SOCCER: Barcelona prepare for their Copa del Rey encounter with Ibiza. Already moved.  
SOCCER: MLS side Los Angeles Galaxy sign Mexico's all-time leading goalscorer Javier "Chicharito" Hernandez from Sevilla. Already moved.  
BASKETBALL (NBA): New Orleans rookie Zion Williamson speaks ahead of his much-hyped NBA debut. Already moved.
GOLF (PGA): Tiger Woods spoke to the media ahead of the Farmers Insurance Open - his first tournament of 2020. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Feb 17, 2020, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.