ETV Bharat / sitara

'శ్యామ్​సింగరాయ్'తో అది సాధ్యమైంది: నాని

నాని ద్విపాత్రాభినయం చేసిన 'శ్యామ్​సింగరాయ్'.. థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు నాని.

nani shyam singha roy
నాని శ్యామ్​సింగరాయ్ మూవీ
author img

By

Published : Dec 22, 2021, 9:18 PM IST

"శ్యామ్‌ సింగరాయ్‌' కథపై ఉన్న నమ్మకం, అనుకోకుండా చెప్పిన మాట పాపులర్‌ అవడం వల్ల 'ఈ క్రిస్మస్‌ మనదే' అంటూ ప్రచారం చేస్తున్నాం' అని నేచురల్ స్టార్ నాని అన్నారు. ఈయన హీరోగా రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కించిన చిత్రమిది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించారు.

* ప్రేక్షకులు మిమ్మల్ని బిగ్‌స్క్రీన్‌పై చూడక రెండేళ్లయింది. దాని గురించి ఏం చెబుతారు?

నాని: పరిస్థితులను బట్టి నేను నటించిన రెండు చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. అంతేకానీ కావాలని ఏం చేయలేదు. సత్వహాగా నేను థియేటర్‌ అభిమానిని. సినిమా విడుదలైన తొలిరోజు తొలి ఆట కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటా. రెండేళ్ల తర్వాత ఆ అనుభూతి రుచి చూడబోతున్నా.

nani sai pallavi
నాని సాయిపల్లవి

* ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కథ విన్నప్పుడు మీకు ఏం అనిపించింది. పాత్రలో లీనమవడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది?

నాని: కథ వినగానే బాగా నచ్చేసింది. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తెరకెక్కిస్తే ఈ సినిమా ఎక్కడికో వెళ్తుందని అనుకున్నా. అంతా నేను ఊహించనట్టుగానే జరిగింది. ఇందులో ద్విపాత్రాభినయం చేశా. పాత్రల్లో ఒదిగిపోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.

* పీరియాడికల్‌ కథలో నటించటం ఎలా అనిపించింది?

నాని: ఇతర కథల కంటే పీరియాడికల్‌ కథలకు చాలా రిస్క్‌ తీసుకోవాలి. 24 క్రాఫ్ట్‌లు ఒకే తాటిపై నిలిస్తేనే ఇలాంటి వాటిని తెరకెక్కించగలం. అలా ఈ చిత్రానికి మంచి టీమ్‌ కుదిరింది. ఈ సినిమాలోని సెట్లు మిమ్మల్ని కొత్త లోకానికి తీసుకెళ్తాయి.

* ‘శ్యామ్‌ సింగరాయ్‌’ గెటప్‌ కమల్‌హాసన్‌ ‘నాయకుడు’ సినిమాను తలపిస్తుంది. మీరేమంటారు?

నాని: అదేం లేదండి. దానికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదు. నా లోపల ఎక్కడో కమల్‌హాసన్‌గారి అభిమాని ఉండటం వల్ల లుక్‌లో ఆ ఛాయలు కనిపించి ఉండొచ్చు.

* దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌లో మీరు మెచ్చిన అంశం?

నాని: 'జెర్సీ' చిత్ర దర్శకుడు గౌతమ్‌లో ఎలాంటి క్వాలిటీస్‌ ఉన్నాయో రాహుల్‌లోనూ అవే ఉన్నాయి. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు పెద్దగా స్పందించరు. తాము అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేంత వరకూ విశ్రమించరు.

* చాలాసార్లు ‘ఈ క్రిస్మస్‌ మనదే’ అని అన్నారు. అంత నమ్మకం ఏంటి?

నాని: కథ మీద ఉన్న నమ్మకం అది. దాంతోపాటు క్రిస్మస్‌ సమయంలో వస్తున్నాం కాబట్టి ఓ ప్రెస్‌మీట్‌లో అలా అన్నా. ఆ మాట పాపులర్‌ అయింది. అందుకే ప్రతిసారీ ‘క్రిస్మస్‌ మనదే’ అని చెబుతున్నా.

* కృతిశెట్టి ఎలా నటించింది?

నాని: తను ఇండస్ట్రీకి కొత్త. అయినా చాలా బాగా నటించింది. తెలియని విషయాల్ని నన్నూ రాహుల్‌ని అడిగేది. ఎన్నో విభిన్న పాత్రలు పోషించాలనేది ఆమె కోరిక. రెండో సినిమా సమయంలోనే అలాంటి ఆలోచనతో ఉండటమనేది అభినందించాల్సిన విషయం.

nani krithi shetty
నాని-కృతిశెట్టి

* సాయిపల్లవితో కలిసి రెండు చిత్రాలు చేశారు. ఆమె గురించి చెప్తారా?

నాని: తనలో ఎలాంటి మార్పురాలేదు. ‘ఎంసీఏ’ చిత్ర సమయంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. మా కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే మళ్లీ అలాంటి పాత్రల్లో కాకుండా సవాలు విసిరే క్యారెక్టర్లు వస్తేనే కలిసి నటించాలనుకున్నాం. ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అది సాధ్యమైంది.

nani sai pallavi
నాని-సాయిపల్లవి

* సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాసిన ఆఖరి చిత్రంగా 'శ్యామ్‌..' నిలిచింది కదా!

నాని: అది యాదృచ్ఛికం మాత్రమే కాదు ఇంకా ఏదో ఉందని భావిస్తున్నాం. ఆయనకు నివాళితో ఈ సినిమా ప్రారంభవుతుంది. ఆయన స్థాయికి తగ్గట్టు మా చిత్ర కథ ఉందనే సంతృప్తి ఉంది. ఈ సినిమా కథను ఆయన రెండు పాటల్లో చెప్పేశారు. దాన్ని ఇప్పుడు మీరు గ్రహించలేరు. సినిమా చూశాక అది మీకు అర్థమవుతుంది. పాటల్లో కథని చెప్పగలిగే ఇలాంటి రచయితలు అరుదు.

sirivennela seetharama sastry last song
సిరివెన్నెల సీతారామశాస్త్రి

* మీ తదుపరి చిత్రాల కబుర్లేంటి?

నాని: 'అంటే సుందరానికీ!' తుది దశ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మరో చిత్రం 'దసరా' త్వరలోనే ప్రారంభంకానుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ తెరకెక్కించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.