మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు చాటుకున్నాడు. కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఉపాధి కోల్పోయిన టాలీవుడ్ సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

అంతకు ముందు ఈయన తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వ సహాయనిధికి రూ.కోటి, తెలుగు రాష్ట్రాల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు విరాళమిచ్చాడు. చిరు కుమారుడు హీరో రామ్‌చరణ్.. కరోనా అరికట్టడంలో భాగంగా రూ.70 లక్షలు(కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి) ఇచ్చాడు.