ETV Bharat / sitara

రానాతో 'లీడర్'​ సీక్వెల్​.. శేఖర్​కమ్ముల క్లారిటీ - love story release date 2021

హీరో రానాతో 'లీడర్​ 2'(leader movie telugu) సినిమా చేస్తానని స్పష్టతనిచ్చారు దర్శకుడు శేఖర్​ కమ్ముల. దీనిపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల తమిళ హీరో ధనుష్​తోనూ ఓ సినిమా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

rana
రానా
author img

By

Published : Sep 20, 2021, 4:29 PM IST

నటుడు రానా హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా' లీడర్'(leader movie telugu). రాజకీయ నేపథ్యంలో విడుదలై(2010లో) ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్​కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
ఇప్పుడీ విషయంపై స్పష్టతనిచ్చారు దర్శకుడు శేఖర్​ కమ్ముల(leader movie director). ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఆయన తెరకెక్కించిన 'లవ్​స్టోరీ'(love story release date 2021) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన 'లవ్​స్టోరీ' తర్వాత తాను తెరకెక్కించబోయే చిత్రాల వివరాలను తెలిపారు. తమిళ హీరో ధనుష్​తో ఓ థ్రిల్లర్​ మూవీని ఇటీవలే ఆయన ప్రకటించారు. దీంతో పాటే రానాతో​ 'లీడర్​ 2' ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై మరోసారి చర్చలు జరపాలని అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత" అంటూ సాగే డైలాగ్​తో నిజమైన నాయకత్వపు లక్షణాన్ని లీడర్​ చిత్రంతో గుర్తు చేశారు శేఖర్​కమ్ముల. "ఇంత బియ్యం, ఇంత కరెంట్, కొన్ని ప్రాజెక్టుల కాదు ప్రజలకు కావాల్సింది, మార్పు కావాలి.. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు రావాలి" అంటూ యువతనూ మెప్పించిందీ చిత్రం.

ఇదీ చూడండి: వెండి తెరపై 'ఓట్ల' సిత్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.