ETV Bharat / sitara

లతా మంగేష్కర్ పాడటం.. సంగీత దర్శకులకు గౌరవం - లతా మంగేష్కర్ సాంగ్స్

Lata mangeshkar news: సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో మధుర గీతాలకు ప్రాణం పోశారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్. ఈమెతో పాట పాడించడాన్ని భారతీయ సంగీత దర్శకులు గౌరవంగా భావించేవారు.

lata mangeshkar
లతా మంగేష్కర్
author img

By

Published : Feb 6, 2022, 10:09 AM IST

Lata mangeshkar dead: భారత ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు శ్రోతలను అలరించారు. ఈమెతో తమ చిత్రంలో పాట పాడించడాన్ని సంగీత దర్శకులు గౌరవంగా భావించేవారు. ఆనాటి శంకర్ జై కిషన్​ నుంచి ఇప్పటి ఏఆర్ రెహమాన్​ వరకు ఈ జాబితాలో ఉన్నారు. తరం మారుతున్నా ఈమె స్వరం మాత్రం సంగీత ప్రియుల్ని అలరిస్తూ ఉండటం విశేషం.

అనిల్ బిశ్వాస్, శంకర్ జైకిసన్, నౌషాద్ అలీ, ఎస్.డి.బర్మన్, పండిట్ అమర్ నథ్ హుసన్ లాల్ భగత్ రాం, సి.రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారు లతాజీ.

లతాతో ఎక్కువ పాటలు పాడించారు సంగీత దర్శకులు శంకర్‌-జైకిషన్. 1957 ముందు తన అన్ని సినిమాలలోనూ ఈమెతోనే పాడించుకున్నారు ఎస్.డి.బర్మన్.

lata mangeshkar
గాయని లతా మంగేష్కర్

1960వ దశకం

'మొఘల్-ఎ-అజమ్' (1960) సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన 'ప్యార్ కియా తో డర్నా క్యా ' పాట ఇప్పటికీ అలరిస్తుండటం విశేషం.

1963 జనవరి 27లో భారత్-చైనా యుద్ధ సమయంలో ప్రధాని నెహ్రూ ఎదుట 'అయే మేరే వతన్ కే లోగో'(నా దేశ ప్రజలారా) పాట పాడారు లతా మంగేష్కర్. ఇది వింటూ నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

1960లలో లతా తన కెరీర్​లోనే అతి పెద్ద హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్​లతో భాగస్వామ్యం మొదలైంది. 1963లో మొదలైన వీరి భాగస్వామ్యం 35 సంవత్సారాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు. జీనేకీ రాహ్ సినిమాకు లతా.. మూడో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1970వ దశకం

1973లో పరిచయ్ సినిమా కోసం పాడిన బీతీ నా బితాయ్ పాటతో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు లతా. మలయాళంలో ఆమె పాడిన ఒకే ఒక పాట 'కాదలీ చెనకదలీ'. నెల్లు(1974) సినిమాలోనిదీ పాట.

1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె.

1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన "సత్యం శివం సుందరం" సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.

1980వ దశకం

1985లో విడుదలైన సంజోగ్ సినిమాలోని లతా పాడిన 'జు జు జు' పాట ఆ ఏడాదిలోనే అతిపెద్ద హిట్. 1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలోనూ పాటలు పాడారు.

1980వ దశకంలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ బాలీవుడ్ సినీ సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. వారి సంగీత సారథ్యంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు లత.

1985 జూన్​లో యునైటెడ్ వే ఆఫ్ గ్రేటర్ టొరొంటోలోని మాపల్ లీఫ్ గార్డెన్స్​లో ఓ సినీ సంగీత కచేరు లతా. 12,000మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్​ నిర్వహించిన స్వచ్ఛంద సంస్థకు 150,000 డాలర్లు వచ్చాయి. ఈ కచేరీని పేదల సహాయార్ధం ఉచితంగా చేశారు లతా.

1990 నుంచి ఇప్పటి వరకు

1990వ దశకంలో ఆనంద్-మిలింద్, నదీమ్-శ్రావన్, జతిన్ లలిత్, దిలీప్ సెన్-సమీర్ సెన్, ఉత్తం సింగ్, అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఎ.ఆర్.రహమాన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో మంచి పాటలు పాడారు మంగేష్కర్. ఈ సమయంలోనే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, గజల్స్ పాడారు.

1990లో లతా.. సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. మొదటి సినిమాగా లేకిన్ తెరకెక్కించారు. ఇందులోని 'యారా సిలి సిలీ' పాటకు ఉత్తమ నేపథ్యగాయనిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

యశ్ చోప్రా దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలోనూ పాటలు పాడారు లతా. రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట, ఆఖరి పాట లతా మంగేష్కర్ పాడటం విశేషం.

1994లో లతా మంగేష్కర్.. కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిశోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళి ఇచ్చారు.

28 నవంబర్ 2012లో లతా తన స్వంత ఆడియో లేబుల్ ఎల్.ఎం.మ్యూజిక్ ద్వారా భజనపాటలు విడుదల చేశారు. ఈ ఆల్బంలో తన చెల్లెలు ఉషా మంగేష్కర్తో కలసి పాడారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా "స్ప్రెడింగ్ మెలోడీస్ ఎవ్రీవేర్" అనే ఆల్బంలో ఓ జానే వాలే తుఝ్కో అనే టైటిల్ పాట పాడారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.