ETV Bharat / sitara

Khushbu Sundar: 'ఆడవాళ్లంటే దానితోనే పని ఉంటుందనుకుంటారు' - రష్మిక

Khushbu Sundar: మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు కిషోర్‌ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కథ రాసుకున్నారని చెప్పారు నటి ఖుష్భూ. ఇందులో కీలక పాత్ర పోషించిన ఆమె.. స్క్రిప్ట్‌ బాగుంటే కొత్త వాళ్లతో చేయడానికైనా సిద్ధమేనని తెలిపారు.

Khushbu Sundar
ఖుష్భూ
author img

By

Published : Feb 25, 2022, 7:22 AM IST

Khushbu Sundar: "కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా చూడగలిగే చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది" అన్నారు నటి ఖుష్బూ. ఆమె.. రాధిక శరత్‌కుమార్‌, ఊర్వశీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శర్వానంద్‌, రష్మిక నాయకానాయికలుగా నటించారు. తిరుమల కిషోర్‌ తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు ఖుష్బూ.

  • "ఆడవాళ్లకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు కిషోర్‌ ఈ కథ రాసుకున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు వినోదమూ చక్కగా కుదిరింది. అందుకే కథ వినగానే కొత్తగా అనిపించి.. ఓకే చెప్పేశా. ఆడవాళ్లంటే ఎక్కువగా గ్లిజరిన్‌తోనే పని ఉంటుందని అనుకుంటారు. ఈ సినిమాతో ఆ భావన తప్పని తెలుస్తుంది. వాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు అనే కోణంలో ఈ కథ సాగుతుంది".
  • "ఈ చిత్రంలో హీరో పాత్రకు ఐదుగురు తల్లులు ఉంటారు. అయితే దీంట్లో నా పాత్ర ఎలా ఉంటుంది? అన్నది తెరపై చూడాల్సిందే. ఈ పాత్ర చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్‌ చేశాను. రేపు సినిమా చూస్తూ.. ప్రేక్షకులు అలాగే ఆనందిస్తే చాలు. కిషోర్‌ లాంటి దర్శకుడితో పనిచేయడం ఏ నటికైనా సౌకర్యంగానే ఉంటుంది. సెట్లో తను టెన్షన్‌ పడిన సందర్భం ఒక్కసారీ చూడలేదు. శర్వా, రష్మిక.. ఇద్దరూ అద్భుతమైన యాక్టర్స్‌. శర్వా అయితే ఓ కుటుంబ సభ్యుడిలాగే అందర్నీ బాగా చూసుకునే వాడు".
  • "నటిగా నాకు సవాల్‌ విసిరే పాత్రలు చేయాలని ఆకలితో ఉన్నా. ప్రస్తుతం తెలుగులో కొన్ని ఆసక్తికరమైన కథలు వింటున్నా. కొత్త దర్శకులు సరికొత్త ఆలోచనలతో వస్తున్నారు. నేనెప్పుడూ స్క్రిప్ట్‌నే నమ్ముతాను. దర్శకుడు కొత్త, పాత అన్నది పట్టించుకోను. స్క్రిప్ట్‌ బాగుంటే కొత్త వాళ్లతో చేయడానికైనా సిద్ధమే".

ఇదీ చూడండి: ఈ చిట్కాలతో 15 కిలోల బరువు తగ్గా: ఖుష్బూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.