కన్నడ పవర్ స్టార్ పునీత్ నటించిన 'నటసార్వభౌమ' చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తమిళ, తెలుగు, మలయాళ సినీ రంగాల్లో నటించిన అనుపమా...ఈ సినిమాతో కన్నడసీమలోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ నెల 7న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. కేజీఎఫ్ చిత్రంలా ఇదీ సంచలనాలు సృష్టించనుందని విశ్లేషకుల అభిప్రాయం.
![kannada movie natasarvabowma](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2414407_natasarwabowma2.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
- హీరో పునీత్ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని దర్శకుడు పవన్ పేర్కొన్నారు.దర్శకుడు పవన్‌తో...
సినిమాలో రవిశంకర్, ప్రభాకర్‌లు ప్రతినాయకులుగా కనిపించారు. హాస్యనటుడు చిక్కన్న కడుపుబ్బా నవ్వించాడు. హీరోయిన్ అనుపమా లాయర్ పాత్రలో జీవించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.
![kannada movie natasarvabowma](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2414407_natasarwabowma3.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)