తన వ్యాఖ్యలతో బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్‌గా తయారయ్యారు నటి కంగనా రనౌత్. సామాజిక సమస్యలతో పాటు సినీ పరిశ్రమలో బంధుప్రీతి గురించి తరచూ మాట్లాడుతూ ముక్కుసూటి హీరోయిన్గా పేరుతెచ్చుకున్నారు. ఇటీవల సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేసిన కంగన.. తాజాగా చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను కంగన టీమ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. గల్వాన్ లోయలో చైనా దాడిలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు మరణించిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.
- View this post on Instagram
"We have to stand together, unite, and collectively fight this war against China!" #अब_चीनी_बंद
">
"భారత్‌కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడం అంటే మన శరీరంలో ఒక భాగాన్ని తీసుకోవడం వంటింది. మన చేతి నుంచి వేళ్లను, భుజాల నుంచి చేతులను వేరేవాళ్లు విరిచేస్తుంటే మనకెంత నొప్పి కలుగుతుంది.? లద్దాఖ్‌ను చైనా ఆక్రమిస్తుంటే అలాంటి బాధే ఇప్పుడు మన దేశం అనుభవిస్తోంది. ఈ పోరులో 20 మంది సైనికులు అమరులయ్యారు. బోర్డర్లో సైనికులు వారి శాయశక్తులా ప్రయత్నిస్తుంటే మనం మనకి తోచింది చేయాలి. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఇచ్చిన పిలుపు మరిచిపోయారా. అప్పుడు బ్రిటీష్ వస్తువులను ఎలా బహిష్కరించామో ఇప్పుడు చైనా వస్తువులను అలాగే బహిష్కరించాలి. అపుడే చైనాకు వెళ్లే రెవెన్యూ తగ్గిపోతుంది."
-కంగనా రనౌత్, హీరోయిన్
ప్రస్తుతం భారత్-చైనా మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలువురు చైనాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరుతున్నారు.