ప్రపంచంలోనే సినీపరిశ్రమ అందమైన మోసమని అంటోంది బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తనకు ఇంకా పని లభించడం వల్ల ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి తాజాగా వెల్లడించింది.
![Jacqueline Fernandez calls Bollywood 'most beautiful fraud in the world'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8177744_209_8177744_1595751784348.png)
"చిత్ర పరిశ్రమ అనేది ప్రపంచంలోనే అత్యంత అందమైన మోసమని నేను గ్రహించా. నేను ఎక్కడి నుంచో వచ్చి.. పదేళ్లుగా బాలీవుడ్లో కొనసాగుతున్నా. నటనలో ప్రదర్శనతో పాటు మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం నటులుగా మనకి అవసరం. ఉత్తమ ప్రతిభతో పాటు కష్టపడి వ్యక్తిగా పని చేయడం నేను నేర్చుకున్న ప్రధాన అంశం. సినిమా అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. వందలాది మంది ఇందులో భాగమౌతారు. ఈ క్రమంలో అనేక మందితో కలిసి పనిచేయగలగాలి. దీంతో కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమనేది నా దృష్టిలో అంతిమం. బంధుప్రీతి అనే అంశం నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకపోవడానికి కారణం నాకింకా పని దొరుకుతోంది. నేను చేయాలనుకున్న పని కాకపోయినా.. కానీ, అది నాకు అవసరం. అందుకే ఆ అంశం నన్ను ఎక్కువగా ప్రభావితం చేయలేదు.
-జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్ నటి
బంధుప్రీతికి వ్యతిరేకం కాకపోయినా.. అభిమానం అనేది పెద్ద సమస్య అని వెల్లడించింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. భారతదేశంలో కాస్టింగ్ విధానంలో లోపం ఉందని.. ఇలాంటి సంస్కృతి విదేశాల్లో లేదని అభిప్రాయపడింది. విదేశాల్లో అయితే కఠినమైన కాస్టింగ్ బోర్డు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఆడిషన్స్ ద్వారా ఎంపికవుతారని.. కచ్చితంగా ఎవర్ని వారు నిరూపించుకోవాల్సిందేనని తెలిపింది. బాలీవుడ్లో కఠినమైన కాస్టింగ్ వ్యవస్థ ఉందో లేదో తనకు తెలియదని.. ద్వితీయ స్థాయి నటులకు ఇది పరిమితమై ఉండొచ్చని భావిస్తోంది హీరోయిన్ జాక్వెలిన్.