ETV Bharat / sitara

samantha: మహేశ్-త్రివిక్రమ్​ మూవీ నుంచి పూజా ఔట్​.. సామ్​కు ఛాన్స్​! - pooja hegde movies

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హాట్​ బ్యూటీ పూజా హెగ్డే.. క్రేజీ ప్రాజెక్టును వదులుకున్నట్లు సమాచారం. సూపర్​స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ (Mahesh Babu Trivikram Movie) కాంబోలో రానున్న చిత్రం నుంచి తప్పుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె స్థానంలో హీరోయిన్​గా సమంత నటించనుందని తెలుస్తోంది.

samantha
పూజా హెగ్డే
author img

By

Published : Nov 25, 2021, 1:51 PM IST

'అల.. వైకుంఠపురములో..' విజయం తర్వాత దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ప్రాజెక్ట్‌లు దక్కించుకొన్నారు బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde). దీంతో కొత్త ప్రాజెక్ట్‌లకు డేట్స్‌ సర్దుబాటు చేయడంలో ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ స్టార్‌హీరో సినిమాను ఆమె చేజార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ పూజా వదులుకున్న ఆ ప్రాజెక్ట్‌ ఏమిటంటే.. #SSMB28. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Maheshbabu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) కాంబినేషన్‌లో ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది.

pooja hegde
పూజా హెగ్డే

ఈ ప్రాజెక్టులో (Mahesh Babu Trivikram Movie) మహేశ్‌కు జోడీగా తొలుత పూజాహెగ్డేను ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం 'రాధేశ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్‌', 'సర్కస్‌' చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఆమె డేట్స్‌ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు మొదట వార్తలు వెలువడ్డాయి. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ తలెత్తడం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని తాజాగా నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. దీంతో, చిత్రబృందం ఆమె స్థానంలో సమంతను(Samantha) తీసుకోవాలనే ఆలోచనలో ఉందట.

samantha
సమంత

ఈ మేరకు టీమ్‌ ఇప్పటికే సామ్‌ను సంప్రదించగా.. ఆమె పచ్చజెండా ఊపినట్లు సమాచారం. మరోవైపు, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్తలే కనుక నిజమైతే.. 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మోత్సవం' తర్వాత మహేశ్‌-సామ్‌ కాంబినేషన్‌లో రానున్న నాలుగో చిత్రం ఇది. త్రివిక్రమ్​తోనూ ఇదివరకే అత్తారింటికి దారేది, సన్​ ఆఫ్ సత్యమూర్తి, అ ఆ సినిమాల్లో నటించింది సామ్. వారి కాంబోలోనూ ఈ సినిమా నాలుగోది కానుంది.

ఇదీ చూడండి: సముద్రం మధ్యలో సెగలు.. పూజా హొయలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.