ETV Bharat / sitara

రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టింది ఎవరో తెలుసా?

టాలీవుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారు దర్శకుడు రాజమౌళి. ఆయన ప్రతి సినిమాకు పడే కష్టం ఎలాంటిదో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుచుకుంటారు. అయితే ఆయనకు జక్కన్న అని పేరు ఎవరు పెట్టారో తెలుసా?

Rajamouli
రాజమౌళి
author img

By

Published : Jul 23, 2021, 10:20 AM IST

తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన పట్టుకున్న కథ హిట్‌ కావాల్సిందే. అంతగా దానిపై దృష్టిపెడతారాయన. సినిమాలోని ప్రతి సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా వచ్చేంత వరకూ టేక్‌ మీద టేక్‌ తీస్తుంటారు. అలా అన్ని సీన్లని ఎన్నోసార్లు చెక్కీ చెక్కీ మనకు అద్భుతాల్ని అందిస్తుంటారు. అందుకే ఆయన్ను అందరూ 'జక్కన్న' అని ముద్దుగా పిలుస్తారు. మరి రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టిందెవరో తెలుసా? ఆయనెవరో కాదు నటుడు రాజీవ్ కనకాల.

rajiv kanakala
రాజీవ్ కనకాల

"నా సీన్‌కి సంబంధించిన చిత్రీకరణ 6 గంటలకు ఉంటే అది కాస్త 10 గంటలకు అవుతుంది. ఎందుకంటే అప్పటికే ఇతర నటులతో మొదలుపెట్టిన సన్నివేశాన్ని తీస్తూనే ఉంటారు రాజమౌళి. ఎన్ని రకాలుగా తీయొచ్చో అన్ని రకాల షాట్స్‌ తీసేస్తారు. అది పూర్తయ్యాకే ఇంకో సీన్‌ ప్రారంభిస్తారు. ఓసారి అరపేజీ సన్నివేశం చేయాల్సి వచ్చింది. త్వరగా అయిపోతుందిలే అనుకున్నా. కానీ, అర్ధరాత్రి 12.30గంటలు అయింది. 'వామ్మో! పని రాక్షసుడు.. చెక్కుతున్నాడు సీన్లని జక్కన్నలా' అని సరదాగా అనుకున్నా. అదే ఆయన పేరులా మారిపోయింది" అని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు రాజీవ్‌ కనకాల. అలా అనుకున్న పేరే ఈ రోజు ఓ బ్రాండ్‌ అయింది. సొంత పేరుకన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

రాజమౌళి, రాజీవ్‌ కనకాల ఇద్దరూ మంచి స్నేహితులు. 'శాంతి నివాసం' సీరియల్‌తో ఈ ఇద్దరూ పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీళ్ల స్నేహం కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తెరకెక్కించిన 'స్టూడెంట్‌ నెం: 1', 'సై', 'విక్రమార్కుడు', 'యమదొంగ' తదితర చిత్రాల్లో రాజీవ్‌ కనకాల మంచి పాత్రలు పోషించారు.

ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది ఈ చిత్రం. అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు రాజీవ్‌ కనకాల.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: వయ్యారాల తమన్నా.. వానలో అలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.