ETV Bharat / sitara

'సీటీమార్' రిలీజ్ డేట్​.. సుధీర్​కు మహేశ్ మద్దతు - Bhootpolice release date

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చాయి. ఇందులో గోపిచంద్​, సుధీర్​ బాబు, రామ్​ పోతినేని చిత్ర వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

updates
అప్డేట్స్​
author img

By

Published : Aug 18, 2021, 9:55 PM IST

కథానాయకుడు గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'సీటీమార్'. విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్ర కొత్త రిలీజ్​ డేట్​ను ఆగస్టు 20న ప్రకటిస్తామని తెలిపింది చిత్రబృందం. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్​గా నటించింది. వీరిద్దరూ కబడ్డీ కోచ్​ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది.

seetimaar
సీటీమార్​

తొలి షెడ్యూల్ పూర్తి

రామ్‌ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ RAPO19 వర్కింగ్‌ టైటిల్‌తో శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ మూవీ తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి.

ram
రామ్ పోతినేని

మహేశ్ చేతుల మీదుగా

దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్‌'(Sridevi Soda Centre). ఈ చిత్ర ట్రైలర్​ను ఆగస్టు 19న ఉదయం 10గంటలకు సూపర్ స్టార్ మహేశ్​బాబు రిలీజ్​ చేయనున్నారు. ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఆనంది కథానాయిక.

హాట్​స్టార్​లో 'భూత్ పోలీస్'

సైఫ్‌ అలీఖాన్‌, అర్జున్‌ కపూర్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ యామీ గౌతమ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'భూత్‌ పోలీస్‌' ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17న స్ట్రీమింగ్‌ అవుతుందని చిత్రబృందం తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'షేర్షా' మేకింగ్ వీడియో

సిద్ధార్థ్‌ మల్హోత్ర కీలక పాత్రలో నటించిన చిత్రం 'షేర్షా' ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. తాజాగా సిద్ధార్థ్‌ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను పంచుకున్నాడు.

ఇదీ చూడండి: ఓటీటీలో నాని 'టక్‌ జగదీష్‌'.. ​సత్యదేవ్​ కొత్త చిత్రం షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.