Mahesh manjrekar news: మరాఠీ, బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఈ నెల 14న విడుదలైన మరాఠీ చిత్రం 'నయ్ వరన్ భట్ లోంచా కొన్ నయ్ కోంచా' వివాదంలో చిక్కుకుంది. అందులో మహిళలు, చిన్నారులను శృంగార సన్నివేశాల్లో అభ్యంతరకర రీతిలో చూపారంటూ క్షత్రియ మరాఠా సేవా సంస్థ కోర్టుకు ఫిర్యాదు చేసంది. మహేశ్ మంజ్రేకర్‌తోపాటు ఆ చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలంటూ అందులో కోరింది. దీనిపై ఫిబ్రవరి 28న విచారణ జరగనుంది.
Mahesh manjrekar telugu movies: మహేశ్ మంజ్రేకర్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. ఇందులో ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్, డాన్ శీను, అఖిల్, గుంటూర్ టాకీస్, వినయ విధేయ రామ, సాహో చిత్రాలు ఉన్నాయి. వీటిలో విలన్, సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు. ఈయన కుమార్తె సయీ మంజ్రేకర్.. ప్రస్తుతం తెలుగులో వరుణ్‌తేజ్ 'గని', అడివి శేష్ 'మేజర్'లో హీరోయిన్గా చేస్తోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: