ఇర్ఫాన్‌ను ఎవరూ భర్తీ చేయలేరు: మెగాస్టార్
ఇర్ఫాన్ ఇక లేరు అన్న వార్త తీవ్రంగా బాధిస్తుందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గొప్ప నటుడు ఇర్ఫాన్ అని ట్వీట్ చేశారు.
''ప్రపంచ గుర్తింపు పొందిన మిమ్మల్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇర్ఫాన్.. మిమ్మల్ని మేం ఎంతో కోల్పోతున్నాం. మీరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.''
- మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ నటుడు