"ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా నేను ఈ జెస్సీనే ఎందుకు ప్రేమించా" - 'ఏ మాయ చేసావె'లో(sam chaitanya film) వినిపించిన తొలి డైలాగ్ ఇది. ఆ సినిమాలో పదే పదే వినిపించే సంభాషణా అదే. అదే కార్తీక్... అదే జెస్సీని మళ్లీ ప్రేమించాడు.. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి కూడా చేసుకున్నారు. 'ఏ మాయ చేసావె'లో కార్తీక్, జెస్సీల రీల్ స్టోరీ బాక్సాఫీసు దగ్గర హిట్టయితే.. నాగచైతన్య, సమంతల(sam chaitanya news) రియల్ లవ్ స్టోరీ తెలుగు సినీ అభిమానుల మనసుల్ని గెలుచుకొన్న సరికొత్త ప్రేమకథగా నిలిచింది. అనంతరం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఇరువురు విడిపోతున్నట్లు(nagachaitanya sam divorce) శనివారం ప్రకటించారు(sam chaitanya divorce). మరి 'ఏ మాయ చేసావె' సందర్భంగా వీరి పరిచయం ఎలా ఏర్పడింది? వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పారు? ఓ సందర్భంలో చై-సామ్ జోడీ పంచుకున్న విశేషాలు..
హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దల్ని ఒప్పించి ఒక్కటవ్వడం సినిమాల్లో చూస్తుంటాం. బాలీవుడ్‌లో అయితే వెండి తెర కథల్ని నిజం చేస్తూ, సినీ తారలు ఒక్కటవ్వడం మామూలే. కానీ, తెలుగు తెరకు మాత్రం అది అరుదైన అనుభూతి. "ఇంటికి తీసుకెళ్లి ఈ అమ్మాయినే పెళ్లి చేసుకొంటా అంటే.. ఏ అమ్మ అయినా 'సరే' అంటుంది" - ఇదీ.. 'ఏమాయ చేసావె'లోని డైలాగే...అచ్చం అలానే సమంతని చైతూ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఇంట్లోవాళ్లూ 'సరే..' అన్నారు. ఈ కథలో విలన్లు లేరు, ప్రతికూల పరిస్థితులు లేవు. అనుకోని ట్విస్టులూ లేవు. అన్నీ హ్యాపీ మూమెంట్సే.
చైతూ, సమంతల(sam chaitanya film) లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? ఎప్పుడు? అని అడిగితే.. "ఏమో.. నాక్కూడా తెలీదు. ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం, సాన్నిహిత్యం ముందు నుంచీ ఉన్నాయి. ఇద్దరం ఒకేసారి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. హిట్లూ, ఫ్లాపులూ సరిసమానంగా ఎదుర్కొన్నాం. అప్పుడే ఒకరికి మరొకరం చేయూత ఇచ్చి పుచ్చుకొన్నాం. మా స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో చెప్పలేను... అంతా ఓ సినిమా కథలా అయిపోయింది" అని చెప్పేవారు చైతూ.
అయితే సమంత మాత్రం అప్పుడప్పుడూ కొన్ని క్లూలు ఇస్తూనే ఉండేది. చైతూకి సంబంధించి చేసే ట్వీట్లలో, చెప్పే మాటల్లో తన ప్రేమంతా బయటపెట్టేది. కానీ.. ఎవ్వరూ అందిపుచ్చుకోలేకపోయారంతే. "ఏ మాయ చేసావె' సందర్భంగా తొలిసారి చైతను కలిసినప్పుడు హాయ్ చెప్పానంతే! ఇక నా దృష్టంతా నాకు ఇచ్చిన డైలాగ్స్‌పైనే ఉండేది. చైతూ తోటి నటులకు చాలా గౌరవం ఇచ్చేవాడు. రెండో షెడ్యూల్‌లో ఒక సీన్ ఏడు నిమిషాలు ఉంటుంది. సింగిల్ టేక్‌లో చేయాలి. చైతన్య నా చేయి పట్టుకుంటే నేను డైలాగ్‌లన్నీ తెలుగులోనే చెప్పాలి. దాంతో చాలా భయం వేసేది. ఇంకో పక్క చైతూ నా చేయి గట్టిగా పట్టుకునేవాడు. చాలా ఒత్తిడిగా అనిపించేది. కానీ, చాలా సందర్భాల్లో చైతూ నాకు సహాయం చేశాడు. అప్పుడే మా స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. నేను ముందు నుంచీ తన గురించి చెబుతూనే ఉన్నా. చాలా ఇంటర్వ్యూలలో చైతూని ప్రస్తావించా. తనని ప్రేమిస్తున్నా అని నేరుగా చెప్పలేదు గానీ, తనంటే ఇష్టమని చెప్పేదాన్ని. ఎవ్వరూ నా వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోలేదు.. అందుకే మేం దొరకలేదు..." అనేది సమంత.
"పరిశ్రమలో నా తొలి స్నేహితుడు చై. కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నప్పుడు తాను నన్ను చూసుకొన్న విధానం ఎప్పటికీ మర్చిపోను. అడుగడుగునా చేయూత అందించాడు. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. నా గురించి తనకు తెలుసు. తన స్నేహితులు, అప్పటి లవ్ స్టోరీలూ.. అన్నీ. అందుకే ఒకరి దగ్గర మరొకరికి దాపరికాలు లేవు" అంటూ తన ప్రేమ కథ గురించి చెప్పేది సమంత. చైతూదీ అదే మాట. "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొన్నా అనిపిస్తుంది. ఇద్దరం జీవితానికి సంబంధించి కీలకమైన మలుపులో ఉన్నాం. తర్వాతేంటి? అని ఆలోచిస్తే 'కలసి జీవితాన్ని కొనసాగించాలి' అనే నిర్ణయమే సరైంది అనిపించింది. ఇంకేం ఆలోచించలేదు. ముందు తనంతట తానే బయటపడింది. ఆ తరవాత ఇద్దరం మా ఇంట్లోవాళ్లతో మాట్లాడాం..." అంటూ తమ ప్రేమకథ పెళ్లికి ఎలా దారితీసిందో చెప్పేవారు.
ఇదీ చూడండి: అవును మేం విడిపోతున్నాం: చైతూ, సమంత ప్రకటన