నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం 'నర్తనశాల'. ఈ సినిమాను ఎంతో ఇష్టంగా తన స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ల క్రితం తెరకెక్కించారు బాలయ్య. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. దివంగత నటి సౌందర్య ద్రౌపదిగా, శ్రీహరి భీముడిగా నటించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈరోజు శ్రేయస్ ఈటీ ద్వారా సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే!
12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండవులు.. కౌరవులకు తెలియకుండా మరో ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. ఆ ఏడాది కాలం ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రశాంతంగా జరిగిపోవాలని, తిరిగి రాజపాలకులుగా పట్టాభిషిక్తులు కావాలని ఆకాంక్షిస్తుంటారు పాండు కుమారులు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విరాటరాజు కొలువులో మత్స్య దేశంలో నివాసం ఉండాలని నిర్ణయిస్తాడు అర్జునుడు.. నకుల, సహదేవులు.. అశ్వ, పశు సంరక్షకులు తామగ్రంథి, తంత్రీపాలుడు అనే పేర్లతోనూ.. జూదక్రీడను అస్త్రంగా ఉపయోగించి కంకుభట్టు పేరుతో ధర్మరాజు.. ద్రౌపది, మాలిని పేరుతో దాసిగా, వలలుడు అనే పేరుతో భీముడిగా మారు పేర్లతో విరాట రాజు కొలువులో చేరాలని అనుకుంటారు. మరి అర్జునుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు.. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ..
ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలు పోషించడం బాలయ్యకే సాధ్యమనేది తెలిసిందే. ఎన్టీఆర్లాగే అర్జునుడి పాత్రలో బాలయ్య మెప్పించారు. సంభాషణలు, హావభావాలతో అలరించారు. ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు వారి పాత్రలకు న్యాయం చేశారు. చాలాకాలం తర్వాత దివంగత సౌందర్య, శ్రీహరిలను తెరమీద చూడడం అభిమానులకు కొత్త అనుభూతినిస్తుంది.
షార్ట్ ఫిల్మ్‌లాగా కేవలం 17 నిమిషాల నిడివి గల ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. దసరా పండగ సందర్భంగా విడుదలైన ఆ సినిమా అభిమానులకు నిజంగా పండగలాంటి అనుభూతిని కలిగిస్తుంది.
పైరసీని ప్రోత్సహించొద్దు
ఈ సినిమా విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు. పైరసీని ప్రోత్సహించవద్దంటూ సూచించారు. శ్రేయస్ ఈటీలోనే ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరారు.
-
NataSimha #NandamuriBalakrishna's message to all movie lovers and his fans.
— BARaju (@baraju_SuperHit) October 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Say No To Piracy and Please report any #Narthanasala piracy links to claims@antipiracysolutions.org
Streaming now on @ShreyasET, Book your tickets now: https://t.co/0TO9SKKVlQ@nbkfilms_ #ShreyasET pic.twitter.com/UgwIjmFeFk
">NataSimha #NandamuriBalakrishna's message to all movie lovers and his fans.
— BARaju (@baraju_SuperHit) October 24, 2020
Say No To Piracy and Please report any #Narthanasala piracy links to claims@antipiracysolutions.org
Streaming now on @ShreyasET, Book your tickets now: https://t.co/0TO9SKKVlQ@nbkfilms_ #ShreyasET pic.twitter.com/UgwIjmFeFkNataSimha #NandamuriBalakrishna's message to all movie lovers and his fans.
— BARaju (@baraju_SuperHit) October 24, 2020
Say No To Piracy and Please report any #Narthanasala piracy links to claims@antipiracysolutions.org
Streaming now on @ShreyasET, Book your tickets now: https://t.co/0TO9SKKVlQ@nbkfilms_ #ShreyasET pic.twitter.com/UgwIjmFeFk