Anasuya Father died: ప్రముఖ వ్యాఖ్యాత, సినీనటి అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కస్బా అనారోగ్యంతో కన్నుమూశారు. 63 ఏళ్ల సుదర్శన్ రావు కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలో తార్నాకలోని నివాసంలో సుదర్శన్ రావు తుదిశ్వాస విడిచారు. దీంతో అనసూయ కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వ్యాపార రంగంలో స్థిరపడిన సుదర్శన్ రావు... రాజీవ్ గాంధీ కాలంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు. తన తల్లికి గుర్తుగా ఆమె పేరునే అనసూయకు పెట్టారు. సుదర్శన్ రావుకు అనసూయతోపాటు మరో కుమార్తె ఉంది. కాగా, అనసూయ డిసెంబరు 17న 'పుష్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే 'ఆచార్య', 'భీష్మ పర్వం', 'ఖిలాడి', 'పక్కా కమర్షియల్',' రంగ మార్తాండ' సినిమాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: స్టైలిష్‌గా శిల్పాశెట్టి.. హాట్‌గా నిధి అగర్వాల్