ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్‌లో భారీ బడ్డెట్‌తో 'ఆదిపురుష్' తెరకెక్కబోతుంది. సూపర్ హిట్ చిత్రం 'తానాజీ' ఫేం ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రాముడిగా కనిపించబోతున్నాడు డార్లింగ్. తాజాగా దీనిపై మాట్లాడాడు దర్శకధీరుడు రాజమౌళి.
"'ఆదిపురుష్' పోస్టర్‌ను మీ అందరికన్నా ముందే చూశా. అద్భుతంగా ఉంది. ఇప్పటికే అత్యున్నత స్థాయిలో ఉన్న అతడి కెరీర్.. ఈ చిత్రంతో ఆకాశమంత పెరిగిపోతుంది. ఈ సినిమా రావడానికి ఇదే సరైన సమయం. అయోధ్యలో ఇటీవల భూమి పూజ జరిగింది. దేశమంతా రాముడి గురించి చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయనపై సినిమా వస్తే చాలా బాగుంటుంది. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నా."
- రాజమౌళి, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు.
ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చూడండి సెప్టెంబరు నుంచి ప్రభాస్ 'రాధే శ్యామ్'