ETV Bharat / sitara

ఆ నటి ఫోన్​ వాల్​పేపర్​గా బాలయ్య ఫొటో! - నటి పూర్ణ బాలకృష్ణ

బాలకృష్ణ(balakrishna akhanda movie poster) లాంటి వ్యక్తిని ఇప్పటివరకు ఎన్నడూ చూడలేదని చెప్పింది నటి పూర్ణ. బాలయ్య సెట్​లో ఉన్నప్పుడు ఎంతో అంకితభావంతో పనిచేస్తారని తెలిపింది. తోటివారిని గౌరవించడంలో ఆయనకు సాటి ఎవరురారని ప్రశంసించింది.

balayya
బాలయ్య
author img

By

Published : Sep 12, 2021, 1:28 PM IST

'అఖండ'(akhanda balakrishna cinema) సినిమాలో బాలకృష్ణతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది నటి పూర్ణ. ఆయన తోటి వ్యక్తులను ఎంతో గౌరవిస్తారని, క్రమశిక్షణ కలిగిన వారని కొనియాడింది. బాలయ్య.. పని పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారని చెప్పిన ఆమె ఆయన్ను 'సింహం'గా అభివర్ణించింది.

"ఈ చిత్రంలో బాలకృష్ణ, నాకు మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఆయన గురించి చాలా విన్నాను. చాలా ఇంటర్వ్యూలు చూశాను. మొదటిసారి కలిసినప్పుడు ఆయన వెంటనే లేచి 'పూర్ణ గారు ఎలా ఉన్నారు' అని అన్నారు. బాలయ్య గారు నాతో మాట్లాడిన విధానం, ఇచ్చిన గౌరవం చూసి ఆశ్చర్యపోయా. తోటివారిని అంతలా గౌరవించే వ్యక్తిని ఇప్పటివరకు నేను చూడలేదు. ఎవరు వచ్చిన లేచి నిలబడతారు. పని చేయడంలో ఆయన 'సింహం' లాంటి వారు. ఒకరోజు ఆయనతో మాట్లాడేటప్పుడు.. 'నా ఫోన్​ వాల్​పేపర్​గా మీ ఫొటో పెట్టుకుంటాను' అని చెప్పా. ప్రతిరోజు లేవగానే ఆయన ఫొటోను చూసి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సింహంలా పనిచేయాలి. అసలు బాలయ్య లాంటి వ్యక్తిని ఇంత వరకు చూడలేదు. నేను కూడా 'అది బాలేదు, ఇది బాలేదు' అంటూ కంప్లెయింట్​ చేస్తా. కానీ ఆయన అలా కాదు. ప్రతిరోజు సెట్​కు వస్తారు. దర్శకుడు ఏమి చెప్పినా అలానే అంటారు. మరో మాట కూడా మాట్లాడరు. బాలయ్యతో మరిన్ని సినిమాలు చేసి, ఆయన నుంచి మరింత స్ఫూర్తిని పొందాలి."

-నటి పూర్ణ.

ఈ సినిమాలో తన పాత్ర ఎంతో బలమైనదని చెప్పింది నటి పూర్ణ. తన పాత్ర పేరు పద్మావతి అని తెలిపింది. దసరా లక్ష్యంగా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తొలి పాట విడుదల చేసి(Akhanda Songs release date).. ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. 'సింహా', 'లెజెండ్‌' లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలయిక నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

ఇదీ చూడండి: Akhanda: బాలయ్య జోరు.. 'అఖండ' డబ్బింగ్​ షురూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.