తమిళంలో మంచి విజయం సాధించిన 'విక్రమ వేద'ను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇద్దరు కథానాయకులతో యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం పంచిన అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు పంచేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారు. కానీ, పట్టాలెక్కేందుకు ఆలస్యమవుతోంది.
మాతృకలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్‌గా విజయ్ సేతుపతి నటించారు. తెలుగు రీమేక్‌లో మాధవన్ పాత్రను నారా రోహిత్, విజయ్ పాత్రను వెంకటేష్ పోషిస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత పోలీసు అధికారిగా రవితేజ, గ్యాంగ్‌స్టర్‌గా కార్తికేయ అని ప్రచారం సాగింది. వీటిలో ఏ ఒక్క కాంబినేషన్‌పై స్పష్టత లేదు.
తాజాగా రామ్ చరణ్ పేరు ఈ జాబితాలో చేరింది. మాధవన్ పాత్రలో చెర్రీ దర్శనమివ్వనున్నాడని టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. విజయ్ పాత్ర కోసం రవితేజ, రానాను సంప్రదించే ప్రయత్నాలు సాగుతున్నాయని టాక్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్టును పునఃనిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ రీమేక్ ఏ కథానాయకుల ఖాతాలోకి వెళ్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: 'హిట్' వెనుక అసలు అర్థం అదే..!