Story of a husband who fought against all odds to make his wife a doctor... Trailer of #Marathi film #AnandiGopal [with English subtitles]... Directed by Sameer Vidwans... 15 Feb 2019 release... #AnandiGopalTrailer: pic.twitter.com/WXf34Nx1Qk
— taran adarsh (@taran_adarsh) February 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Story of a husband who fought against all odds to make his wife a doctor... Trailer of #Marathi film #AnandiGopal [with English subtitles]... Directed by Sameer Vidwans... 15 Feb 2019 release... #AnandiGopalTrailer: pic.twitter.com/WXf34Nx1Qk
— taran adarsh (@taran_adarsh) February 2, 2019Story of a husband who fought against all odds to make his wife a doctor... Trailer of #Marathi film #AnandiGopal [with English subtitles]... Directed by Sameer Vidwans... 15 Feb 2019 release... #AnandiGopalTrailer: pic.twitter.com/WXf34Nx1Qk
— taran adarsh (@taran_adarsh) February 2, 2019
ఫిబ్రవరి 15న ఆనంది గోపాల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. భార్యను చదివిస్తున్న భర్త కష్టాల్ని... కట్టుబాట్లను కూలదోసి వాళ్లు పడిన అవస్థల్ని హృదయాన్ని హత్తుకునేట్లు ట్రైలర్లో చూపించారు.
సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిశోర్ అరోరా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ మిలింద్ ఆనంది గోపాల్ పాత్రను పోషిస్తున్నారు.
ఇదీ కథ...
మహారాష్ట్రలో 1865 మార్చి 31న జన్మించిన ఆనందిగోపాల్ అసలు పేరు యమున. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే తన కంటే 20 ఏళ్ల పెద్దవాడైన గోపాల్రావుతో వివాహమయ్యింది. ఆనంది భర్త ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. మహిళలు చదువుకోవాలనే ఆశయంతో భార్యను వైద్య కోర్సు పూర్తి చేయమని అమెరికా పంపిస్తారు. 14 ఏళ్ల వయస్సులోనే బిడ్డకు జన్మనిచ్చినా... సరైన వైద్యం అందక శిశువుని కోల్పోయారు ఆనంది. తను పడిన వేదన మరొకరు పడకూడదనే తలంపుతో పట్టుదలగా రెండేళ్ల వైద్య డిగ్రీని అమెరికాలో పూర్తి చేశారు. 1886లో దేశానికి తిరిగొచ్చి కొల్హాపూర్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో ఫిజిషియన్గా సేవలందించారు. దురదృష్టవశాత్తు 1887లో క్షయతో మరణించారు ఆనంది.