ETV Bharat / science-and-technology

Sirisha Bandla: అంతరిక్షంలో తెలుగమ్మాయి తొలి అడుగు!

చిన్నప్పుడు నక్షత్రాల్నీ, చంద్రుణ్నీ చూసి వాటిని అందుకోవాలనుకుంది. అందుకోసం వ్యోమగామి (Astronaut) అవ్వాలనుకుంది. ‘దృష్టి’ సమస్యతో తన లక్ష్యానికి దూరమవుతానేమో అనుకుంది. అయినా పట్టువీడలేదు. మరో మార్గంలో ప్రయత్నించింది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ తాజాగా అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగానూ నిలిచింది. ఆమె శిరీష బండ్ల. ఆకాశపు అంచులు దాటబోతోన్న తన ప్రయాణం సాగిందిలా!

sirisha bandla journey
అంతరిక్షంలో తెలుగమ్మాయి తొలి అడుగు!
author img

By

Published : Jul 3, 2021, 11:03 AM IST

శిరీష బండ్ల స్వస్థలం.. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు. తండ్రి బండ్ల మురళీధర్‌, తల్లి అనురాధ ఇద్దరూ యూఎస్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నారు. అక్క ప్రత్యూష వర్జీనియా యూనివర్సిటీలో సైంటిస్ట్‌. శిరీషకు ఆరేళ్లున్నప్పుడు వీళ్ల కుటుంబం టెక్సాస్‌లోని హోస్టన్‌కి మారిపోయింది. వాళ్లకి దగ్గర్లో ఓ స్పేస్‌ సెంటర్‌ ఉండేది. ఓసారి అక్కడికి వెళ్లినపుడు అది ఆమెను బాగా ఆకట్టుకుంది. అప్పట్నుంచి తరచూ వెళ్లేది. అల్లంత దూరానున్న నక్షత్రాల్నీ, చంద్రుడినీ అందుకునేందుకు ఆస్ట్రోనాట్‌ (Astronaut) అవ్వాలనుకుంది. ఎయిర్‌ఫోర్స్‌ కోర్సులు చదివి, పైలట్‌ అయితే తర్వాత నాసాలో అవకాశం పొందొచ్చన్నది ఆమె ప్లాన్‌. కానీ తనకు హైస్కూలు స్థాయిలో కంటి సమస్య వచ్చింది. పైలట్‌ లేదా ఆస్ట్రోనాట్‌ అవ్వడానికి కావాల్సిన కనీస అర్హత మంచి కంటి చూపు. దీంతో తను నిరుత్సాహపడింది.

ఇంటర్‌ సమయంలో ఒక ప్రైవేటు స్పేస్‌ టూరిజం (Private space‌ tourism) సంస్థ గురించి తెలుసుకుంది. నాసా మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో అవకాశాలున్నాయని అప్పుడే అర్థమైందామెకు. మళ్లీ తన కలపై దృష్టిపెట్టింది. ఈసారి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌పై దృష్టిపెట్టింది. దాని ద్వారా కమర్షియల్‌ స్పేస్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్నది ఆమె లక్ష్యం.

ప్రాక్టికల్​గా నేర్చుకుంటూ..

శిరీషకు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంపై ఆసక్తి ఎక్కువ. తరగతిలో కంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ తెలుసుకోవచ్చని నమ్ముతుంది. అందుకే ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది మినహా మిగిలిన మూడేళ్లూ చదువుతూనే ఓ ఇంజినీరింగ్‌ సంస్థలో ఇంటర్న్‌గానూ పనిచేసింది. నైపుణ్యాలను నేరుగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుంది. ఇంజినీరింగ్‌ సమయంలోనే ‘జీరో గ్రావిటీ’లో ప్రయాణించే అవకాశమూ దక్కించుకుంది. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందగానే ఉద్యోగంలో చేరిపోయింది. అప్పుడే తనకు సాంకేతికాంశాలు తప్ప వ్యాపార అంశాల్లో పరిజ్ఞానం లేదని అర్థమైంది. దీంతో జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి స్పేస్‌ ఇండస్ట్రీ (Space‌ Industry)లో ఎంబీఏ చేసింది. తన ఆసక్తి తెలిసిన ప్రొఫెసర్‌ కమర్షియల్‌ స్పేస్‌ ఫెడరేషన్‌ (CSF) అనే సంస్థ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. అక్కడ ఇంటర్వ్యూకు హాజరై ఎంపికైంది. అలా 2012లో తన కలల రంగంలోకి కాలూనింది.

ప్రెసిడెంట్​ స్థాయికి ఎదిగి..

ఇక్కడే తనకు మాథ్యూ ఇసాకోయిజ్‌ ఫెలోషిప్‌ అవకాశమూ వచ్చింది. ఇక్కడ స్పేస్‌ పాలసీ(Space‌ policy)ల గురించి నేర్చుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్స్‌ డిజైనింగ్‌ (Aircraft Designing)తోపాటు కమర్షియల్‌ స్పేస్‌ ఇండస్ట్రీ పాలసీ (Commercial space industry policy)లపైనా పని చేసింది. 2015లో వర్జిన్‌ గాలక్టిక్‌(Virgin‌ Galactic‌)కి మారిపోయింది. ఇదీ స్పేస్‌ టూరిజం సంస్థే. దీనిలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌ మేనేజర్‌గా చేరి, వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ లాంచర్‌వన్‌, స్పేస్‌షిప్‌2 ప్రోగ్రామ్‌లు విజయం సాధించడంలోనూ శిరీష ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా ఈ సంస్థ ఈ నెల 11న ఒక టెస్ట్‌ స్పేస్‌ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనుంది. దీనిలో సంస్థ వ్యవస్థాపకుడు బ్రాన్‌సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించ నున్నారు. వాళ్లలో 30 ఏళ్ల శిరీష ఒకరు.

ఏదైనా సాధించొచ్చు..

శిరీష ఈ రంగంపై యువతకు అవగాహన కల్పించడమే కాకుండా వారిని ప్రోత్సహిస్తోంది కూడా. మేథ్స్‌పై ఆసక్తి లేని వారికీ ఎన్ని మార్గాలున్నాయో తెలియచెప్పడం కోసం స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూంటుంది. తన కలను నెరవేర్చుకోవడంలో అమ్మానాన్నలతోపాటు టీచర్లదీ ప్రధాన పాత్రేనంటోంది తను. ‘నువ్వేదైనా చేయగలవు’ అని వారిచ్చిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయిలో నిలిపిందంటుంది. చేయాలన్న బలమైన తపన ఉంటే దేన్నైనా సాధించడం సాధ్యమేననే శిరీష.. అమెరికన్‌ ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ, ఫ్యూచర్‌ స్పేస్‌ లీడర్స్‌ ఫౌండేషన్లకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ కూడా. పర్‌డ్యూ యూనివర్సిటీ యంగ్‌ ప్రొఫెషనల్‌ అడ్వయిజరీ కౌన్సెల్‌కు మెంబర్‌.
డాక్యుమెంటరీలు తీయడమంటే సరదా పడే శిరీషకి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. ఖాళీ సమయాల్లో మారథాన్‌ల్లోనూ పాల్గొంటుంది. మాంసాహారాన్ని ఇష్టపడే ఈమె ఎంత నచ్చిన వంటకమైనా పరిమితంగానే తీసుకుంటుంది. ఎవరితోనైనా త్వరగా కలిసిపోవడం ఈమె నైజం. పెరిగింది అమెరికాలోనేనైనా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వీలున్నప్పుడల్లా మన దేశానికి వస్తుంటుంది. గత ఏడాది తనకు కాబోయే భర్తనూ తీసుకొచ్చింది. త్వరలో పెళ్లిపీటలూ ఎక్కనుంది!

ఇదీ చూడండి:

Space tour: తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.