ETV Bharat / science-and-technology

రెడ్​మీ నుంచి మరో కొత్త స్మార్ట్​ఫోన్​​- ఐఫోన్ కంటే సూపర్​ కెమెరా!- ధర ఎంతంటే? - రెడ్​మీ నోట్​ 13 ఫీచర్స్

Redmi Note 13 Series Launch : ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీ మరో మిడ్​-రేంజ్​ మొబైల్​ ఫోన్​ను ఇండియన్​ మార్కెట్​లోకి లాంఛ్​ చేసింది. రెడ్‌మీ నోట్​ 13 5జీ సిరీస్​ పేరుతో దీనిని గురువారం విడుదల చేసింది. మరి దీని ఫీచర్స్​, ధర తదితర వివరాలు మీకోసం.

Redmi Note 13 Series Launch
Redmi Note 13 Series Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 4:11 PM IST

Redmi Note 13 Series Launch : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీదారు సంస్థ షావోమీ మరో మిడ్​-రేంజ్​ రెడ్​మీ మొబైల్​ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్​ పేరుతో ఈ ప్రోడక్ట్​ను గురువారం జరిగిన ఓ ఈవెంట్​లో లాంఛ్​ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని Xiaomi ఇండియా అధికారిక YouTube ఛానెల్‌లో ప్రత్యక్షప్రసారం చేశారు. కాగా, ఈ సిరీస్​ మోడల్​ గతేడాది సెప్టెంబర్​లోనే చైనాలో లాంఛ్​ అయింది. ఇక 3 మోడళ్లలో రెడ్‌మీ నోట్​ 13 5జీ సిరీస్​​ ఫోన్​ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఐఫోన్​ 15 కెమెరా కంటే మెరుగ్గా!
Redmi Note 4Gతో భారతీయ మార్కెట్​లో అడుగుపెట్టిన షావోమీ తన 10 సంవత్సరాల సంబరాలను జరుపుకుంటోంది. Redmi Note 13 Pro+ 5G కెమెరా పనితీరు ప్రస్తుతం హవా సృష్టిస్తోన్న iPhone 15 Pro Maxతో పాటు శామ్​సంగ్​ S23 అల్ట్రా కంటే మెరుగ్గా ఉన్నాయని రెడ్​మీ కంపెనీ పేర్కొంది. Redmi Note 13 Pro+ 5G జనవరి 10న ఉదయం 10 గంటలకు Mi.com, Mi Home, Flipkartతో పాటు Xiaomi రిటైల్​ స్టోర్​లలో అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఐసీఐసీఐ బ్యాంక్​ కార్డ్‌లను ఉపయోగించి రూ.2,000 వరకు డిస్కౌంట్స్​ను పొందవచ్చని తెలిపింది. ఇక రెడ్‌మీ నోట్​ 13 5జీ సిరీస్ ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.

Redmi Note 13 5G సిరీస్ మోడళ్లు :

  • Redmi Note 13 5G క్లాసిక్
  • Redmi Note 13 Pro 5G
  • Redmi Note 13 Pro Plus 5G

200 MP కెమెరా
Redmi Note 13 Pro+ 5G మొదటి 'ట్రూ' 200MP కెమెరాను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. కెమెరాకు సంబంధించి మెరుగైన ఫొటోలు, వీడియోల క్వాలిటీ కోసం శామ్​సంగ్​, MediaTek సంస్థలతో కలిసి పనిచేసినట్లు వివరించింది షావోమీ.

HyperOS స్క్రీన్
Redmi డివైజ్​ ప్రియులు ఎంతగానో వేచి చూసిన Xiaomi కొత్త HyperOS స్కిన్​ను తాజాగా విడుదల చేసిన Redmi Note 13 5G సిరీస్​లో గమనించవచ్చు. దాదాపు అన్ని డివైజుల్లో పనిచేసేలా దీని ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు రెడ్​మీ తెలిపింది.

ఫ్యూజన్ డిజైన్​
రెడ్‌మీ నోట్​ 13 ప్రో+లో ఫ్యూజన్ డిజైన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది వాటర్‌ప్రూఫ్ వేగన్​ లెదర్​ బ్యాక్‌తో వస్తుంది. నానోస్కేల్ వేర్-రెసిస్టెంట్​ ఇంక్ టెక్నాలజీతో దీని వెనక భాగాన్ని ప్రింట్ చేశారు.

డిస్ప్లే
Redmi Note 13 Pro+ 6.67-అంగుళాలతో 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1800 nits గరిష్ఠమైన ప్రకాశంతో DOLBY Vision Atmosను సపోర్ట్ చేస్తుంది.

చిప్‌సెట్
4nm ప్రాసెస్ ఆధారంగా MediaTekకు చెందిన డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ను వినియోగించిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్​ Redmi Note 13 Pro+ అని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ NFC సపోర్ట్​తో 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జర్​ కెపాసిటీతో వస్తుంది.

త్వరలో బడ్స్​
రెడ్‌మీ నోట్ 13 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ డివైజ్​తో పాటు Redmi Buds 5 పేరుతో ఇయర్​బడ్స్​, షావోమీ పోర్టబుల్ జ్యూస్ బ్లెండర్ కప్‌లను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది కంపెనీ.

కారు మైలేజీ పెంచుకోవాలా? ఈ టిప్స్ పాటిస్తే మీకు ఎదురే ఉండదు!

ఆర్థిక లక్ష్యాల సాధన కోసం - బెస్ట్​ 'సొల్యూషన్​ ఓరియెంటెడ్'​ మ్యూచువల్ ఫండ్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.