ETV Bharat / science-and-technology

ఒక్కసారి ఛార్జింగ్​తో 500కిమీ జర్నీ, ఓలా కార్​ ఫీచర్స్ ఇవే

author img

By

Published : Aug 15, 2022, 3:18 PM IST

విద్యుత్ వాహనాల రంగంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది ఓలా. ఒక్కసారి ఛార్జింగ్​తో 500 కిలోమీటర్లు ప్రయాణించగల ఎలక్ట్రిక్ కార్​ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఈ-బైక్​లకు అప్డేట్లు, సరికొత్త బ్యాటరీ అభివృద్ధి, ఫ్యాక్టరీ సామర్థ్యం పెంపు వంటి విషయాలపై సంస్థ ప్రణాళికలను వెల్లడించారు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్.

ola electric car specifications
ఒక్కసారి ఛార్జింగ్​తో 500కిమీ జర్నీ, ఓలా కార్​ ఫీచర్స్ ఇవే

Ola electric car specifications : ఒక్కసారి ఛార్జింగ్​తో 500 కిలోమీటర్ల ప్రయాణం.. 4 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సత్తా.. భారత్​లో ఇప్పటివరకు ఎన్నడూ డిజైన్ చేయని స్పోర్టీ లుక్​.. ఆల్​ గ్లాస్​ రూఫ్.. కీ లెస్.. త్వరలో మార్కెట్లోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్ కార్ ఫీచర్లు ఇవి. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్.

స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ ఓలా ఎలక్ట్రిక్​ భవిష్యత్ ప్రణాళికల్ని వెల్లడించారు భవీష్. సోమవారం 'మిషన్ ఎలక్ట్రిక్ 2022' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో.. విద్యుత్ కార్ సహా ఇతర కొత్త ఉత్పత్తుల వివరాలను తెలియజేశారు. ఈవీల ప్రేమికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఓలా విద్యుత్​ కార్​పై అధికారిక ప్రకటన చేశారు. ఆ వాహనం ఫీచర్లు ఎలా ఉండనున్నాయో సంక్షిప్తంగా చెప్పారు. ఒక చిన్నపాటి హ్యాచ్​ బ్యాక్​ సైజులో, తాళాలు, హ్యాండిల్స్ లేకుండా ఉంటుందని వివరించారు. మూవ్​ ఓఎస్​తో పనిచేస్తూ, అసిస్టెడ్ డ్రైవింగ్ ఫీచర్స్​తో.. ప్రపంచంలోని ఇతర ఈవీలకు దీటుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే.. ఓలా విద్యుత్ కారుకు సంబంధించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించలేదు. 2024లో ఈ వాహనం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ఓలా ఎస్​1 పేరిట మరో ఈ-బైక్​ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు భవీష్ అగర్వాల్. దేశీయంగా అభివృద్ధి చేసిన సరికొత్త బ్యాటరీని పరిచయం చేశారు. ప్రస్తుతం ఓలా బైక్​లకు మూలాధారమైన ఓఎస్​ను అప్డేట్ చేశామని, సరికొత్త మూవ్​ ఎస్​3ని దీపావళికి విడుదల చేస్తామని తెలిపారు. ఓలా బైక్​ల కోసం దేశంలోని 50 ప్రధాన నగరాల్లో 100 హైపర్​ ఛార్జర్​లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

తమిళనాడులోని వాహనాల తయారీ కేంద్రం విస్తరణపైనా తన ప్రణాళికలు వెల్లడించారు ఓలా సీఈఓ. మొత్తం 100 గిగావాట్​ అవర్ సామర్థ్యంతో కోటి స్కూటర్లు, 10 లక్షల కార్లు తయారు చేసేలా ఫ్యాక్టరీని 100 ఎకరాల్లో విస్తరిస్తున్నట్లు తెలిపారు. విస్తరణ పూర్తయ్యాక.. రెండు వెహికిల్ ప్లాట్​ఫామ్స్​ అభివృద్ధి చేస్తామని, ఆరు రకాల కార్లు అభివృద్ధి చేస్తామని వివరించారు భవీష్ అగర్వాల్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.