గాలిలోని కాలుష్యాన్ని తొలగిస్తూ... చెడుగాలిని పీల్చుకుని, దాన్ని శుభ్రపరిచి బయటికి పంపుతూ... వాతావరణంలోని తేమ శాతాన్నీ నియంత్రించేలా... ఈ ఎయిర్ ప్యూరిఫయర్ పనిచేస్తుంది. దీనిలోనే మొక్క పెంచుకునే సౌకర్యం ఉంది. గాలిలోని అలర్జీ కారకాల్లాంటి వాటిని మొక్క దగ్గర ఉండే మట్టిలోకి పంపుతూ... శుభ్రమైన గాలిని బయటికి పంపేలా దీన్ని రూపొందించారు. ఈ పరికరం మొక్క పరిస్థితినీ... మనం నీళ్లు పోయాల్సిన సమయాన్నీ మనకు యాప్ ద్వారా తెలియజేస్తుంది. పచ్చదనమూ ప్యూరిఫయర్ రెండూ ఒక చోట ఉంటే ఇంకా కావల్సిందేముంది..!
ఇదీ చదవండి: రోబోకు మీ ముఖం ఇస్తే... 90 లక్షలు!