ETV Bharat / science-and-technology

Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్‌ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు - ఆదిత్య ఎల్​1 ఇస్రో ప్రయోగం

Aditya L1 Mission Astronaut Chris Hadfield : అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్ క్రిస్‌ హడ్‌ఫీల్డ్‌.. సాంకేతిక రంగంలో భారత్‌ సాధిస్తున్న విజయాలను కొనియాడారు. ఈ భూమిపై ప్రతిఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు.

Aditya L1 Mission
Aditya L1 Mission
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 11:03 AM IST

Updated : Sep 2, 2023, 11:20 AM IST

Aditya L1 Mission Astronaut Chris Hadfield : చంద్రయాన్‌-3 విజయం ఇచ్చిన జోష్‌తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. సూర్యుడి సమీపంలో పరిశోధనలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకోసం తాజాగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఈ సమయంలో అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తున్న భారత్‌కు.. అంతర్జాతీయంగా ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్ క్రిస్‌ హడ్‌ఫీల్డ్‌.. సాంకేతిక రంగంలో భారత్‌ సాధిస్తున్న విజయాలను కొనియాడారు. ఈ భూమిపై ప్రతిఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు.

"సూర్యుడి గురించి మరింతగా అర్థం చేసుకునేందుకు, దాని నుంచి ఎదురయ్యే ముప్పులను పసిగట్టేందుకు ఆదిత్య-ఎల్‌1 వంటి ప్రయోగాలు సహాయం చేస్తాయి. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారు. ఇంటర్నెట్‌ గ్రిడ్‌, ఎలక్ట్రిక్ గ్రిడ్‌, రోదసిలోని ఉపగ్రహాలు, వ్యోమనౌకలను సమర్థంగా రక్షించుకోవడానికి ఈ ప్రయోగం కీలకం కానుంది. ఈ భూమండలంపై సూర్యుడి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి దోహదం చేస్తుంది"

-- క్రిస్‌ హడ్‌ఫీల్డ్‌, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్

Aditya L1 Mission ISRO : భారత్‌ సాంకేతికంగా సాధిస్తోన్న పురోగతిని నాసా మాజీ కమాండర్​ క్రిస్​ హడ్​ఫీల్డ్​ ప్రశంసించారు. ఇటీవల విజయవంతమైన చంద్రయాన్‌-3 ప్రయోగం గురించి స్పందించిన క్రిస్‌ హడ్‌ఫీల్డ్‌.. అభివృద్ధి చెందుతున్న భారత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రయోగం తేటతెల్లం చేసిందని ప్రశంసించారు. ఇది భారత్‌తో పాటు ఈ ప్రపంచానికి ఒక గర్వించదగ్గ క్షణమని ఆయన అన్నారు.

  • #WATCH | Aditya-L1 Mission will be launched today by the Indian Space Research Organisation (ISRO) from Sriharikota

    (Visuals from Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh) pic.twitter.com/wvJZTyE0iW

    — ANI (@ANI) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆదిత్య విజయం కోసం హోమాలు, పూజలు..
Aditya L1 Mission Pujas : మరోవైపు ఆదిత్య-L1 విజయం కోసం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని ఆలయంలో హోమం నిర్వహించారు. ఉత్తరాఖండ్​లో సూర్యనమస్కారాలు చేశారు. మరోపక్క ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు ఔత్సాహికులు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)కు చేరుకుంటున్నారు. విద్యార్థులు కూడా స్నేహితులతో కలిసి విచ్చేస్తున్నారు. చంద్రయాన్‌-3 విజయం తమకు అంతరిక్ష కార్యక్రమాలపై ఆసక్తిని కలిగించిందని వారు పేర్కొన్నారు.

'ఆదిత్య' విజయం కోసం సూర్యనమస్కారాలు

Aditya L1 Launch : ఇస్రో 'ఆదిత్య' ప్రయోగానికి అంతా సిద్ధం.. సౌర వాతావరణ పరిశోధనే లక్ష్యం

Last Updated : Sep 2, 2023, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.