Sankranti Special Sweet Recipes: సంక్రాంతి (sankranti) అనగానే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది.. అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అళ్లుల్లు, కోడి పందాలు.. వీటితో పాటు.. ప్రతి ఇంట్లోనూ ఘుమఘుమలాడే సంప్రదాయపు పిండి వంటలు. పిండి వంటలు అంటే ముఖ్యంగా అరిసెలు, లడ్డూలు గుర్తొస్తాయి. అసలు సంక్రాంతి సమయంలో అరిసెలు(Ariselu) లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. మరి ఈరోజు అరిసెలు, బూందీ లడ్డూ తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అరిసెలు:
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం-1కేజీ
- బెల్లం-1కేజీ(తీపి ఎక్కువ తినేవారు ఇంకొంచెం వేసుకోవచ్చు)
- నువ్వులు-2టీస్పూన్స్
- యాలకుల పొడి-1 టీస్పూన్
- నెయ్యి-పావుకప్పు
- నూనె-వేయించడానికి సరిపడా
సంక్రాంతికి పిండి వంటలు చేస్తున్నారా? ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి!
తయారీ విధానం:
- ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని.. వాటిని ఒక రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి.
- తర్వాతి రోజున ఆ బియ్యం కడిగి.. రోట్లో వేసి దంచి పిండిని జల్లెడ పట్టాలి.
- ఇప్పుడు స్టౌ మీద ఓ మందపు గిన్నె పెట్టి.. దానిలో తురిమిన బెల్లం వేసుకుని కొద్దిగా నీరు పోసుకోవాలి.
- బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకుని మెల్లగా పాకం వచ్చేలా గరిటెతో తిప్పుతూ ఉండాలి.
- బెల్లం పాకం అరిసేలకు సరిపడినట్లు వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఒక చిన్నప్లేట్లో నీరు తీసుకుని అందులో ఈ బెల్లం పాకం కొంచెం వేసుకుని ఉండలాగా చేసుకోవాలి. అప్పుడు పాకం జారకుండా ఉండలెక్క వస్తే.. అందులో కొంచెం నువ్వులు వేసుకోని.. అనంతరం స్టౌవ్ని సిమ్లో పెట్టుకోవాలి
- తర్వాత ఆ పాకంలో తడి బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ.. ఉండలు లేకుండా కలపాలి.
- అలా కలిపిన తర్వాత ఇప్పుడు అరిసెలు తయారీకి చలిమిడి రెడీ అవుతుంది.
- ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి..నూనె వేసుకుని వేడి చేసుకోవాలి.
- సిద్ధం చేసుకున్న పిండిని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. ఓ పాలితిన్ కవర్ పైన గుండ్రంగా చేతితో ఒత్తుకోవాలి.
- తర్వాత వాటిని వేడి నూనెలో వేసుకుని మంటను మీడియంలో పెట్టి.. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
- తర్వాత రెండు చిల్లుల గరిటెతో వాటిని గట్టిగా అద్దుకుని తీసుకుంటే సరి.. అంతే ఆంధ్ర స్పెషల్ రుచికరమైన అరిసెలు రెడీ.
సంక్రాంతి- నాలుగు రోజుల పండగంట! మీకు తెలుసా మరి?
బూందీ లడ్డూ:
కావాల్సిన పదార్థాలు:
- శనగపిండి-అరకేజీ
- పంచదార-అరకేజీ
- వేయించిన జీడిపప్పు-10
- వేయించిన ఎండుద్రాక్ష-10
- యాలకుల పొడి- అర టీస్పూన్
- పచ్చ కర్పూరం-చిటికెడు
- ఫుడ్ కలర్-చిటికెడు
- నూనె-వేయించడానికి సరిపడా
మకర సంక్రాంతి ఎప్పుడు? - పండగ ఏ రోజున జరుపుకోవాలి?
బూందీ లడ్డూ తయారీ విధానం..:
- ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- పిండి దోశ పిండి కంటే కూడా పల్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక బూందీ గరిటెను కళాయిలో ఉంచి అందులో పిండిని వేసి చేత్తో కానీ గరిటెతో కానీ పిండిని రుద్దాలి.
- తరువాత బూందీని గరిటెతో కలుపుతూ అర నిమిషం పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
- ఇలా మిగిలిన పిండితో బూందీని తయారు చేసుకున్న తరువాత మరో కళాయిలో పంచదార, ఒక గ్లాస్ నీళ్లు పోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి.
- పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న బూందీని వేసి కలపాలి.
- ఇందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
- తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ.. తగిన పరిమాణంలో బూందీని తీసుకుని లడ్డూలా ఒత్తుకోవాలి.
- ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డూలు తయారవుతాయి.
- వీటిని గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 నుంచి 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.