LIVE ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ షాడో ఎమ్మెల్యేలు- నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం లైవ్ - Nakka Anand Babu Live
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 1:07 PM IST
|Updated : Jan 12, 2024, 1:29 PM IST
TDP Leader Nakka Anand Babu Press Meet Live: పెత్తందారి విధానం గురించి తరచూ చెప్పే ముఖ్యమంత్రి జగన్ తన సొంత పార్టీలోనే దీన్ని అమలు చేస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూనే వారికి ఎసరు పెడుతున్నారన్నారు. పార్టీలో పెత్తందారి విధానం తీరు చూసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే నిర్ఘాంత పోతున్నారని పేర్కొన్నారు. సీట్లాటలో బడుగు, బలహీనవర్గాలనే బలిపెట్టిన సీఎం జగన్ నియోజకవర్గాల్లో మార్పులు చేశారనన్నారు.
వైఎస్సార్సీపీలో దళితులు, బడుగులనే బలి చేస్తున్నారని, వ్యతిరేకత ఉన్నా సీఎం సామాజికవర్గ నేతల్ని కొనసాగిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. టికెట్ల విషయంలో అసలు సిసలు పెత్తందారీ విధానాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అమలు చేస్తూ బడుగు బలహీనవర్గాలను బలిపెట్టిందని అన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల విషయంలో ఒక ప్రధాన సామాజికవర్గం వారైతే ఒక లెక్క. బడుగు బలహీనవర్గాలైతే వేరే లెక్క అనే విధానాన్ని పాటించారని ధ్వజమెత్తారు. దీంతోపాటు 36 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. దీనిపై నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.