LIVE: ‘‘పంచాయతీతోనే ప్రగతి’’ వర్కషాప్లో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు - TDP Chandrababu Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 5:42 PM IST
|Updated : Jan 3, 2024, 8:10 PM IST
TDP Chandrababu at Sarpanchula Samara Sankharavam Program Live: ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించిన సర్పంచులు పార్టీలకు అతీతంగా జగన్ ప్రభుత్వంపై యుద్ధభేరి మోగించారు. దానిలో భాగంగా గ్రామాల అభివృద్ధికి 'సర్పంచుల సమర శంఖారావం' పేరుతో ఇవాళ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజయవాడ- మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయానికి(DGP Office) సమీపంలో సీ.కే కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర సర్పంచుల సంఘం(State Sarpanch Association), ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్(AP Panchayat Raj Chamber) సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీ.కే కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచులు హాజరవుతున్నారు. వారి ఆహ్వానం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో 'సర్పంచుల సమర శంఖారావం' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యక్ష ప్రసారం మీకోసం