కావల్సినవి:
- ఫలూదా సేవ్ - రెండు చెంచాలు
- సబ్జా గింజలు - చెంచా
- పాలు - 2 కప్పులు
- రూఅఫ్జా - చెంచా
- వెనిల్లా ఐస్‌క్రీం - ఒక స్కూన్
- కస్టర్డ్ పొడి - చెంచా
- పల్చగా తరిగిన డ్రైఫ్రూట్స్ పలుకులు - 2 చెంచాలు
- చక్కెర - 2 చెంచాలు
తయారీ విధానం:
రెండు చెంచాలు తప్ప మిగిలిన పాలను ఓ గిన్నెలో తీసుకుని మరిగించాలి. ఇంతలో మిగిలిన పాలల్లో కస్టర్డ్ పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో సేవ్, చక్కెర వేసి కలపాలి. తరవాత కస్టర్డ్ మిశ్రమం కూడా వేసి రెండు నిమిషాల తరవాత పొయ్యి కట్టేయాలి. ఇది చల్లారక ముందు రూఅఫ్జాని గ్లాసులో వేసి, పాల కస్టర్డ్‌ని వేయాలి. దానిపైన సబ్జా గింజలు వేసుకోవాలి. చివరగా ఐస్‌క్రీం, డ్రైఫ్రూట్స్ వేసుకుంటే చాలు. రుచికరమైన కస్టర్డ్ ఫలూదా సిద్ధం.
ఇవీ చూడండి: